Breaking News

డీఎస్‌ చివరి కోరిక అదే.. మేము నెరవేర్చాం: సీఎం రేవంత్‌

Published on Sun, 06/30/2024 - 12:32

సాక్షి, నిజామాబాద్‌: సీనియర్‌ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్‌ అండగా నిలబడుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. అలాగే, డీఎస్‌ కోరికను కూడా మేము నెరవేర్చాము అని తెలిపారు.

కాగా, సీఎం రేవంత్‌ ఆదివారం నిజామాబాద్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా డీఎస్‌ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. డీఎస్‌ కుమారులు అర్వింద్‌, సంజయ్‌లను పరామర్శించారు. అనంతరం, సీఎం రేవంత్‌ మాట్లాడుతూ..‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానిక డీఎస్‌ కష్టపడ్డారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి శ్రీనివాస్‌. కొంత కాలం కాంగ్రెస్‌ పార్టీకి దూరమైన పార్లమెంట్‌లో డీఎస్‌ను సోనియా గాంధీ అప్యాయంగానే పలకరించేవారు.

పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని డీఎస్ అనేవారు. చనిపోయినపుడు తనపై కాంగ్రెస్ జెండా కప్పి ఉంచాలన్నది డీఎస్ కోరిక. అందుకే ముఖ్య నాయకులను పంపి వారి కోరిక తీర్చాము. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)