Breaking News

బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో.. కేసీఆర్‌ హామీలివే..

Published on Sun, 10/15/2023 - 15:02

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పదేళ్లలో శాంతియుత వాతావరణం నెలకొల్పామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆదివారం ఆయన బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రకటించారు. ‘‘గత మేనిఫెస్టోలో లేని 90 శాతం పథకాలను అమలు చేశాం. మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మిని ప్రకటించపోయినా అమలు చేశాం. రైతు బంధు మేనిఫెస్టోలో చేర్చలేదు.. అయినా అమలు చేశాం. సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ కరువుతో అల్లాడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రణాళిక ప్రకారం ప్రయాణం సాగింది. గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేశామని కేసీఆర్‌ పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో
► తెల్లరేషన్‌కార్డుదార్లుకు త్వరలో కేసీఆర్‌ బీమా.. ప్రతి ఇంటికి ధీమా
► రైతు బీమా తరహాలోనే కేసీఆర్‌ బీమా
► కేసీఆర్‌ బీమాతో 93 లక్షల కుటుంబాలకు లబ్ధి
►జూన్‌ నుంచి కేసీఆర్‌ బీమా పథకం అమలు చేస్తాం
►తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో ప్రతి రేషన్‌కార్డుదారుడికి సన్న బియ్యం అందజేస్తాం
►‍ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే ఇచ్చే హామీలన్నింటిని అమలు పరుస్తాం
►తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌
►సామాజిక పెన్షన్లు రూ.5వేల వరుకూ పెంచుతాం
►దశవారిగా పెన్షన్లు పెంచుతాం
►పెన్షన్లు ఏడాదికి రూ.500 పెంచుతూ వెళతాం
►ఏపీ సీఎం జగన్‌ పాలనపై సీఎం కేసీఆర్‌ ప్రశంసలు
►ఏపీలో పెన్షన్‌ స్కీం చాలా విజయవంతంగా జరుగుతోంది

►వికలాంగుల పెన్షన్‌ రూ.6వేల వరుకూ పెంచుతాం
►వికలాంగుల పెన్షన్‌ మార్చి తర్వాత రూ.5 వేలు
►రైతు బంధు రూ.16 వేల వరుకూ పెంచుతాం
►అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల భృతి
►సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు రూ.3వేల భృతి
►అర్హులైన లబ్ధిదారులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌
►అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌

►ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు​ పెంచుతాం
►జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షల వరుకూ పెంచుతాం
►కేసీఆర్‌ ఆరోగ్యరక్ష పేరుతో హెల్త్‌ స్కీమ్‌
►జర్నలిస్టులకు ఉద్యోగుల తరహాలో హెల్త్‌ స్కీమ్‌
►హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

►అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒక గురుకులం
►మహిళా స్వశక్తి గ్రూపులకు దశలవారీగా పక్కా భవనాలు
►అనాథ పిల్లల కోసం పటిష్టమైన పాలసీ
►ఓపీఎస్‌ డిమాండ్‌పై కమిటీ నియామకం.. కమిటీ సిఫార్సుల మేరకు తుది నిర్ణయం

చదవండి: ఏపీ సీఎం జగన్‌ పాలనపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రశంసలు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)