దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉండడు: సీఎం జగన్‌

Published on Sat, 05/11/2024 - 16:59

సాక్షి, కాకినాడ జిల్లా: సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని.. పొరపాటున బాబుకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన పిఠాపురంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కూటమి మోసాలను ఎండగట్టారు. ఇంటింటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్సార్‌సీపీని గెలిపించాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇదే..
‘‘చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇదే. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే. కూటమికి ఓటేస్తే పథకాలన్నిటింకీ ముగింపే. 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జమ చేసింది. రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ది, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు. ఐదేళ్లు లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. ఇంటి వద్దకే పెన్షన్‌, పౌరసేవలు, పథకాలు ఇస్తున్నాం. గతంలో ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను కూటమి నేతలు చెత్తబుట్టలో వేశారు’’ అంటూ సీఎం జగన్‌ మండిపడ్డారు.

ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా..
‘‘2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలు అమలు చేశాం. గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు చూశారా. అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉన్నాం. డ్రైవర్‌ అన్నదమ్ములకు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం. జగనన్న తోడు, చేదోడుతో చిరు వ్యాపారులకు తోడుగా నిలిచాం’’ అని సీఎం పేర్కొన్నారు.

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే
‘‘స్వయం ఉపాధికి గతంలో ఈ పథకాలు ఉన్నాయా?. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాం. మన మేనిఫెస్టోను నేరుగా ఇళ్లకే పంపి ఆశీస్సులు తీసుకున్నాం. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే’’ అని సీఎం చెప్పారు.

మీ ఇద్దరినీ అడుగుతున్నా..
‘‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరి వెళ్లి భూములు కొన్నాడు.. బాలకృష్ణ మొన్ననే విశాఖలో రిషికొండలో భూమలు కొన్నాడు.. మీ ఇద్దరినీ అడుగుతున్నా.. మీకు ఒరిజినల్ డీడ్స్ ఇచ్చారా? జిరాక్స్ ఇచ్చారా?. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 9 లక్షల మందికి ఒరిజినల్ డీడ్స్ ఇచ్చాం’’ అని సీఎం జగన్‌ వివరించారు.

దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?
‘‘వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న దత్తపుత్రుడికి ఓటు వేయకండి.. దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?. గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు. దత్తపుత్రుడిని మహిళలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఐదేళ్లకోసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నాడు’’ అంటూ సీఎం జగన్‌ ఎద్దేవా చేశారు.

దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉండడు: సీఎం జగన్‌

 

 

 

 

 

 

 

 

 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)