Breaking News

కాంగ్రెస్‌ దే హార్యానా.. సీఎం పీఠం ఎవరిదంటే..!

Published on Mon, 10/07/2024 - 20:20

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందంటూ మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. మొత్తం 90 నియోజకవర్గాలకు గానూ 55కి పైగా స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఇక రేపు(అక్టోబర్‌ 8) అధికారిక ఫలితాలు వెలువడనున్న ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు ఎవరు చేపడతారన్న దానిపై చర్చ మొదలైంది.

ప్రధానంగా సీఎం పదవికి ముందంజలో ఉన్న పార్టీ సీనియర్‌ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్‌ సూర్జేవాలా పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఎంపీ కుమారి సెల్జా స్పందించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పార్టీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అయితే ఆ పదవికి కావాల్సిన అర్హతలు, అనుభవం తనకు ఉందని పేర్కొన్నారు.

@నేనేమీ చెప్పలేను. నేనే కాదు. ఎవరూ ఏం చెప్పలేరు.. సీఎం ఎవరనే విషయం హైకమాండ్‌ ప్రకటన తర్వాతే తెలుస్తుంది.. హైకమాండ్‌ నిర్ణయాన్ని అందరూ అంగీకరిస్తారు.. నేను ఇప్పటికే పబ్లిక్‌ డొమైన్‌లో మాట్లాడాను.. ఈ విషయం హైకమాండ్‌కు తెలుసు. అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది.’ అని కుమారి సెల్జా సోమవారం తెలిపారు.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ 'భారత్‌ జోడో యాత్ర’ ఆయనపై.  పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మార్చేసిందని పేర్కొన్నారు. ‘రాహుల్ యాత్రతో మొత్తం మారిపోయింది. ఆయనపై ప్రజల్లో ఉన్న అవగాహన, కాంగ్రెస్‌పై ఉన్న అభిప్రాయం, బీజేపీపై ఉన్న అభిప్రాయం మారిపోయింది. అందుకే లోక్‌సభలో బీజేపీ సీట్లు ఎలా తగ్గాయో చూశాం. హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.’ అని పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)