చంద్రబాబుని లెక్క చేయని మంత్రులు!

Published on Thu, 12/11/2025 - 13:46

సాక్షి, విజయవాడ: ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లైట్‌ తీసుకుంటున్నారా?. పద్దతి మార్చుకోవాలని పదే పదే చెబుతున్నా.. తమ దారి తమదేనన్న రీతిలో వాళ్లు వ్యవహరిస్తుండడం, దానికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం రోటీన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో..  

ఇవాళ కేబినెట్‌ మీటింగ్‌లోనూ సీన్‌ రిపీట్‌ అయ్యింది. ఏకంగా మంత్రులపైనే చంద్రబాబు చిందులు తొక్కినట్లు సమాచారం. ఇంతకీ ఎందుకు అంటారా?.. మంత్రులు కాస్త లేట్‌గా కేబినెట్‌ మీటింగ్‌కు వచ్చారట!. దీంతో నా అధ్యక్షతన జరిగే కేబినెట్‌ భేటీనే పట్టించుకోరా? అని మండిపడ్డారట!. ఆపై ఏమనుకున్నారో ఏమో కాస్త శాంతించి.. 

మంత్రులు అయ్యి ఉండి మీరే టైంకి రాకపోతే ఎలా?.. అని కాస్త తగ్గిన వాయిస్‌తో చంద్రబాబు మాట్లాడారట. అలా లేట్‌గా వచ్చిన వాళ్లలో ఆనం రామనారాయణరెడ్డి, సంధ్యారాణి, సుభాష్‌లు ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడంతో ఆయనలోని కోపధారి బయటకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. 

బుధవారం ఏం జరిగిందంటే.. రాష్ట్ర మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన హెచ్‌ఓడీల (హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్స్‌) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పలుమార్లు సూచనలు చేసినప్పటికీ మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్నారు. ‘‘చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా తెలియడం లేదు. మంత్రులు తమ శాఖలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఫైళ్ల పురోగతి, ప్రాజెక్టుల స్థితి, బడ్జెట్‌ వినియోగం వంటి అంశాలపై రోజువారీగా సమీక్ష చేయాలి’’ అన్నారు. అలాగే.. కేంద్రం నుంచి నిధులు రప్పించడంలో మంత్రులు అట్టర్‌ప్లాప్‌ అవుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారని అధికార వర్గాలు తెలిపాయి.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)