Suman: వైఎస్సార్‌సీపీదే గెలుపు: సినీనటుడు సుమన్‌ 

Published on Mon, 02/19/2024 - 09:12

తిరుపతి కల్చరల్‌ (తిరుపతి జిల్లా): సామాజిక న్యాయపాలనకు ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే మళ్లీ గెలుస్తుందని ప్రముఖ నటుడు సుమన్‌ స్పష్టం చేశారు. తన వీరాభిమాని బుజ్జమ్మ కుమార్తె వివాహం కోసం తిరుపతికి వచ్చిన ఆయన ఆదివారం తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు.

అనంతరం సుమన్‌ను ఆలయ చైర్మన్‌ కట్టా గోనీయాదవ్‌ శాలువతో సత్కరించి అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గంగమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేక ఏ పార్టీకైనా మద్దతు పలుకుతారా అని మీడియా ప్రశ్నించగా రాజకీయ పరంగా పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు సీనియర్‌ సిటిజన్స్‌కు ప్రాధాన్యత కల్పిస్తూ మేనిఫెస్టో అందించే పార్టీకి తన సంపూర్ణ సహకారం ఉంటుందని సుమన్‌ చెప్పారు.

రాజకీయం అంటే పదవులు చేపట్టడం కాదని, ప్రజల సంక్షేమం దిశగా ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజాదరణ పొందినప్పుడే ప్రజా నాయకులు అవుతారని, ఎంత కష్టమైనా ఇచ్చి­న హామీలు నెరవేర్చి ప్రజల కోసం శ్రమించే వారికే పట్టం కడతారని పేర్కొన్నారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)