Breaking News

ముఖ్యమంత్రి సమోసాలు ఎవరు తీసుకున్నారు?.. సీఐడీ దర్యాప్తు

Published on Fri, 11/08/2024 - 12:53

‘నేను ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. నేనొచ్చిన కార్యక్రమానికి నాకు సమోసాలు పెట్టకుండా.. నా సిబ్బందికి పెడతారా? వెంటనే ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారెవరో గుర్తించి, కఠిన చర్యలు తీసుకోండి’ అని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆ రాష్ట్ర  పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ సమోస స్కామ్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 21న  హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుక్కు సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ క్వార్టర్స్ ప్రారంభించేందుకు వెళ్లారు. సీఎం సుక్కు పర్యటన రాక నేపథ్యంలో ఐజీ ర్యాంక్ అధికారి.. సీఎం వ‌స్తున్నారు. వెంట‌నే స్నాక్స్ ఏర్పాటు చేయండి అంటూ ఎస్సైని ఆదేశించారు. దీంతో స‌ద‌రు ఎస్సై  (స‌మోసాలు సీఎం కోస‌మ‌ని చెప్ప‌కుండా) .. త‌న అసిస్టెంట్ స‌బ్ ఇన్స్పెక్ట‌ర్  (ఏఎస్‌ఐ), హెడ్‌ కానిస్టేబుల్‌ను స‌మోసాలు తీసుకుని రావాల‌ని పుర‌మాయించారు.  

ఎస్సై ఆదేశాల‌తో ఏఎస్ఐ, కానిస్టేబుల్ స్థానిక లక్కర్ బజార్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ నుంచి మూడు పెట్టెల స‌మోసాల‌ను తీసుకొచ్చారు. సీఎం సుక్కు కార్యక్రమం ప్రారంభమైంది. అక్క‌డే ఉన్న ఏఎస్సై, కానిస్టేబుల్ తెచ్చిన స‌మోసాల్ని ప‌క్క‌నే ఉన్న మ‌హిళా ఎస్సైకి అందించారు. స్నాక్స్ పెట్టాల‌ని కోరారు. మ‌హిళా ఎస్సై ఆ స‌మోసాలను  సీఎం కోసం తెచ్చిన‌వే అని తెలియ‌క బ‌దులుగా సీఎం సిబ్బందిలోని మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ (ఎంటీ) విభాగానికి పంపించారు. ఆ విభాగంలోని ఉద్యోగులే ఆ స‌మోసాల్ని తిన్నారు.

మీటింగ్‌లో ఉన్న సీఎంతోపాటు, సీఐడీ బాస్‌, ఇతర ఉన్నతాధికారులు ఆకలితోనే వెనుదిరిగారు. అధికారుల తీరుపై సీఎంతో పాటు సీఐడీ బాస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విచార‌ణ‌కు ఆదేశాల‌కు జారీ చేశారు.

సీఎం సమోసాలు ఎవరు తిన్నారు? సీఐడీ దర్యాప్తు..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)