Breaking News

‘అవసరమైతే ఎన్డీయే నుంచి బయటకొస్తాం’

Published on Sat, 03/16/2024 - 18:17

బీహార్‌లో ఎన్డీయే కూటమికి మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ (ఆర్‌ఎల్‌జేపీ) ఝలక్‌ ఇచ్చింది. తాము కోరుకున్న స్థానాలు ఇవ్వని పక్షంలో ఒంటరి పోరుకైనా సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో ఉన్న మంత్రి పశుపతి కుమార్ పరాస్ స్వయంగా ప్రకటించారు. 

రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ(ఆర్‌ఎల్‌జేపీ)కి గట్టిపట్టు ఉన్న ఐదు స్థానాల్లో పోటీ ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరతాం. ఆ సీట్లను వేరేవాళ్లకు కేటాయిస్తే చూస్తూ ఊరుకోం. నేను కూడా లోక్‌సభ బరిలో ఉంటా అని పశుపతి కుమార్ పరాస్ స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని గనుక విస్మరిస్తే.. ఏ నిర్ణయం తీసుకోవటానికైనా వెనకాడబోమని ఎన్డీయేను హెచ్చరించారాయన.

కూటమిలో భాగంగా చిరాగ్‌ పాశ్వన్‌ లోక్‌జనశక్తి పార్టీ(రాం విలాస్‌)కి బీజేపీ ఐదు సీట్లను కేటాయించింది. అందులో.. ఆర్‌ఎల్‌జేపీ చీఫ్‌ పశుపతి ప్రాతినిధ్యం వహిస్తున్న హాజీపూర్‌ స్థానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూటమిలో తమకు  ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఆర్‌ఎల్‌జేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ‘కూటమి నుంచి వెళ్లిపోవడానికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి’ అంటూ పశుపతి వ్యాఖ్యానించడం గమనార్హం.

‘మేము ఎన్డీయేలో భాగం. మేము నిజాయితీగా కూటమిలో ఉన్నాం. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటే మాకు గౌరవం ఉంది. మా పార్టీకి బీజేపీ నుంచి ప్రాధాన్యత లభించటం లేదని వార్తలు వస్తున్నాయి. మా పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ చివరి జాబితా వెల్లడించే వరకు మేము వేచిచూస్తాం. ఆ తర్వాత మేము ఇక ఎవరికి గౌరవం ఇవ్వాల్సి అవసరం లేదు. మా స్వేచ్ఛానుసారం కూటమి నుంచి బయటకు వచ్చేస్తాం. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు’ అని పశుపతి పేర్కొన్నారు.

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)