Breaking News

‘నాన్నే నా ప్రాణం’.. చిరాగ్‌ భావోద్వేగ పోస్ట్‌

Published on Tue, 06/11/2024 - 12:05

బీహార్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ మూడోసారి ఎంపీగా ఎన్నికై, తొలిసారి మోదీ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. మోదీ 3.0 క్యాబినెట్‌లో చిరాగ్ పాశ్వాన్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖను కేటాయించారు. చిరాగ్‌ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్  ఒకప్పుడు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖలను చేపట్టారు. తాజాగా చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ను గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను షేర్‌ చేశారు.

ఈ పోస్టుకు తన తండ్రికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలను జతచేశారు. నాడు రాష్ట్రపతి భవన్‌లో రామ్ విలాస్ పాశ్వాన్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫొటోను చిరాగ్‌ పోస్ట్‌ చేశారు. అలాగే తాను తన తండ్రితో  ఉన్నప్పటి ఫొటోలను కూడా షేర్‌ చేశారు.  వీడియోలో రామ్ విలాస్ పాశ్వాన్ రికార్డ్ చేసిన వాయిస్ ప్లే అవుతుంది. అలాగే ఇదే వీడియోలో చిరాగ్‌ మాట్లాడుతూ ఈ దీపం(చిరాగ్‌) దేశానికి, ప్రపంచానికి వెలుగు నిచ్చేదిగా మారినందుకు సంతోషిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

చిరాగ్‌ షేర్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు మూడు కోట్ల మంది వీక్షించగా, 11 లక్షల మంది లైక్ చేశారు. అదే సమయంలో చిరాగ్‌ను ప్రశంసిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో బీహార్ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని కొందరు పేర్కొన్నారు.

Videos

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు