Breaking News

ఎన్డీయే కూటమిలో చేరిన మరో కీలక పార్టీ..

Published on Mon, 07/17/2023 - 20:53

పాట్నా: 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటు ప్రతిపక్ష కూటమి ఏర్పాటు దిశగా పలు ప్రతిపక్ష పార్టీలు సన్నాహాలు చేస్తుండగా.. అటు ఎన్డీయే కూడా తన బలాన్ని పెంచుకునే దిశగా పావులు కదుపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎన్డీయేలో కలిసిన మరుసటి రోజే బిహార్‌లో మరో పార్టీ బీజేపీతో చేతులు కలిపింది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌ జన్‌శక్తి పార్టీ ఎన్డీయే కూటమిలో చేరింది. 

బిహార్‌లో చిరాగ్ పాశ్వాన్ లోక్‌ జన్‌శక్తి పార్టీ ఎన్డీయేలో కలుస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఈ రోజు కేంద్ర హో మంత్రి అమిత్ షా తో జరిగిన సమావేశం అనంతరం ఆయన వెల్లడించారు. ఎన్డీయే కుటుంబంలో చేరుతున్న చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్వాగతం పలికారు. జులై 18న ఎన్డీయే కూటమి ఢిల్లీలో  నిర్వహిస్తున్న సమావేశానికి ముందు  చిరాగ్ పాశ్వాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.   

లోక్‌ జన్‌శక్తి పార్టీని బిహార్‌లో రామ్‌ విలాస్ పాశ్వాన్ స్థాపించారు. ఆయన ఆరు సార్లు లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం బీజేపీ కూటమి తరపున రాజ్య సభకు కూడా ఎన్నికయ్యారు. ఇప్పుడు తండ్రి బాటలోనే చిరాగ్‌ కూడా బీజేపీ కూటమిలో చేరారు. 

ఇదీ చదవండి: Rajbhar Joins In NDA: ఎస్పీకి దెబ్బ మీద దెబ్బ.. ఎన్డీయే కూటమిలో చేరిన ఎస్‌బీస్పీ..


 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు