Breaking News

చంద్రబాబు మాకొద్దు.. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో కనిపించని బాబు ఫొటో

Published on Sun, 05/21/2023 - 08:46

సాక్షి, తిరుపతి: ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు కనిపించలేదు. ఫ్లెక్సీలు, జెండాల్లో చంద్రబాబు బొమ్మను పెట్టేందుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఇష్టపడలేదు. టీడీపీ ముఖ్య నేతలు ప్రాధేయ­పడ్డా జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు తిరస్కరించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పదవి, పార్టీని లాక్కుని ఆయన మరణానికి కార­­ణమైన వ్యక్తి ఫొటోను పెడితే ఆయన ఆత్మ క్షోభిస్తుందని జూనియర్‌ అభిమానులు అభిప్రా­యం వ్యక్తం చేశారు.

తిరుపతి నగరంలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఘనం­గా నిర్వహించారు. తిమ్మినాయుడు­పాళెం వ­ద్ద ఎన్టీ­ఆర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనియర్‌ అభిమా­నులు భారీ ఫ్లెక్సీ­లు, బ్యానర్లు, జెండాలు ఏర్పాటు చేశారు.
చదవండి: తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి 

అ­యి­తే వీటిలో ఎక్కడా చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు కనిపించకుండా జాగ్రత్తప­డ్డారు. విగ్ర­హా­విష్కర­ణకు వచ్చి­న ముఖ్య నేతలు చెప్పినా వారు పట్టించుకోలేదు. కాగా, ఫ్లెక్సీలు, జెండాల్లో చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు లేవని కొందరు దౌర్జన్యంగా వాటిని తొలగించారు.

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)