Breaking News

సాక్షి మీడియాపై కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్‌ కుట్రలు

Published on Thu, 10/16/2025 - 15:43

సాక్షి, హైదరాబాద్‌: సాక్షి మీడియాపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. సాక్షి పత్రిక ఎడిటర్‌ ధనుంజయరెడ్డికి ఏపీ పోలీసులు వరుసగా నోటీసులు ఇచ్చారు. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు.. ఒకే కేసులో వరుసగా నోటీసులు ఇచ్చి బెదిరించేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వరుసగా మూడు రోజుల నుంచి పోలీసులు వస్తున్నారు. సమాధానం ఇచ్చినా.. పదేపదే నోటీసులు ఇస్తున్నారు.

కాగా, హైదరాబాద్‌లోని సాక్షి పత్రిక ప్రధాన కార్యాలయంలో ఏపీ పోలీసులు బుధవారం(అక్టోబర్‌ 15) కూడా దాదాపు 10 గంటల పాటు హల్‌చల్‌ చేయడం... ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డిని విచారణ పేరుతో వేధించారు. ఇక ఎస్సీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్‌చార్జిని కూడా వారం రోజులుగా వేధిస్తుండటం సర్కారు కుట్రలను బహిర్గతం చేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, దోపిడీని బట్టబయలు చేస్తున్న ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు సాగిస్తోంది. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు.. ఎడిటర్‌కు నోటీసుల పేరుతో విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో కూడా ఆదివారం(అక్టోబర్‌ 12) తెల్లవారుజామున పోలీసుల దాష్టీకానికి దిగిన సంగతి తెలిసిందే.

సాక్షి ఆఫీస్ లో హై డ్రామా!

టీడీపీ సిండికేట్‌ నకిలీ మద్యం దోపిడీని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పోలీసు జులుంతో బరి తెగిస్తోంది! రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు తెగబడుతోంది. నకిలీ మద్యం దారుణాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై కక్ష సాధింపు చర్యలకు తెగిస్తోంది. మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ మద్యం మాఫియాపై పోరాడుతున్న ‘సాక్షి’పై అధికార మదంతో విరుచుకుపడుతోంది. నకిలీ మద్యం రాకెట్‌ దారుణాలను వెలుగులోకి తేకుండా కట్టడి చేయాలనే పన్నాగంతో బరితెగిస్తోంది. ఆర్టికల్‌ 19 (1) కింద రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కులను పాశవికంగా కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది.

 

 

 

 

 

 

 

 

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు