Breaking News

కేంద్ర కేబినెట్‌లో ఇద్దరికి చాన్స్‌?

Published on Thu, 06/06/2024 - 05:44

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి కొలువు దీరనున్న ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఈసారి తెలంగాణకు రెండు కేబినెట్‌ బెర్త్‌లు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో రాష్ట్రంలో ఎదిగేందుకు ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ మేరకు పార్టీలో అంతర్గత నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించినట్టు తెలిసింది. పార్టీలో సీనియారిటీ, విధేయత, కులాల సమీకరణలు దృష్టిలో పెట్టుకొని ఒక రెడ్డి, మరొక బీసీ సామా జికవర్గ నేతకు కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇదివరకే కేబినెట్‌ మంత్రిగా పనిచేసిన జి.కిషన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌  నుంచి గెలిచిన డీకే అరుణ పోటీలో ఉండే అవకాశం ఉంది. అయితే కిషన్‌రెడ్డినే మరోమారు కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆయన్ను పార్టీ అధ్యక్షు డిగా కొనసాగించాలని నిర్ణయిస్తే అరుణకు అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఇక బీసీ సామాజికవర్గం నుంచి బండి సంజయ్, ధర్మ పురి అరవింద్, ఈటల రాజేందర్‌లలో ఒకరికి అవకాశం ఉంటుందని అంటున్నారు.

 ఇందులో వరుసగా రెండోసారి గెలిచిన బండికే ఎక్కువ అవకాశాలున్నాయని తెలుస్తోంది. మోదీ పట్ల ఉన్న విధేయత, 2 లక్షలకుపైగా మెజారిటీ, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ పటిష్టతకు చేసిన కృషికి గుర్తింపుగా ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటారని అంటున్నారు. ఆయనకు సంఘ్‌ కుటుంబం నుంచి మద్దతు లభిస్తుందనే వాదన ఉంది. ఇక సీనియర్‌ నేతగా ఈటలకు సైతం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా, తొలిసారి ఎంపీగా ఎన్నికవడం, పార్టీలో చేరి ఎక్కువకాలం కాకపోవడం వంటి అంశాలు ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.

 కేబినెట్‌లో తీసుకునే వారి పేర్లపై గురువారం లేక శుక్రవారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం ఉంటుంది. అంతకుముందే మంత్రి పదవులపై స్పష్టత రావొచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర కేబినెట్ లో ఇద్దరికి ఛాన్స్ ? కేంద్ర కేబినెట్ లో ఇద్దరికి ఛాన్స్ ?

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)