Breaking News

జార్ఖండ్ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Published on Sat, 10/19/2024 - 20:34

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అధికార ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. పొత్తుల ఖరారు, అభ్యర్థుల ప్రకటన, ప్రచారాలపై కసరర్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ తమ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను ప్రకటించింది. జార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలు ఉండగా.. 66 మందితో కూడిన తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. 

మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్‌ మరాండీ ధన్‌వార్‌ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. జేఎంఎం నుంచి బయటకు వచ్చిన చంపయ్‌ సోరెన్‌ సరాయ్‌కెలా నుంచి పోటీ చేయనున్నారు. ఇక జామ్‌తాడా నుంచి సీతా సోరెన్‌, కోదర్మా నుంచి నీరా యాదవ్ పోటీ చేయనున్నారు. గండేలో బీజేపీ అభ్యర్థిగా మునియా దేవి, సింద్రీలో తారాదేవి, నిర్సా నుంచి అప్నార్నా సేన్‌గుప్తా ప్రాతినిధ్యం వహించనున్నారు.ఝరియా నుంచి రాగిణి సింగ్, చైబాసా నుంచి గీతా బల్ముచు చైబాసాలో, పుష్పా దేవి భూయాన్ ఛతర్‌పూర్ నుంచి పోటీ చేయనున్నారు.

కాగా పొత్తులో భాగంగా బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. దాని మిత్రపక్షాలు, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 10, జనతాదళ్ (యూ) రెండు, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఒక చోట నుంచి పోటీ చేయనున్నాయి. కాగా జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో  రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 23న ఓట్లు లెక్కింపు ఉండనుంది. 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు