Breaking News

పోలింగ్‌కు సర్వం సన్నద్ధం: ఏపీ సీఈవో

Published on Sat, 05/11/2024 - 17:55

సాక్షి, అమరావతి: ఎల్లుండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్ జరుగుతుందని సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 వరకూ.. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 వరకూ, ఆయా నియోజకవర్గాల్లో 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుందని వెల్లడించారు.

సైలెన్స్ పీరియడ్‌లో రాజకీయ ప్రచారం పూర్తిగా నిలిచిపోతుంది. సైలెన్స్ పీరియడ్‌లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సాయంత్రం 6 తర్వాత ప్రచారం కోసం బయటినుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్ళిపోవాలన్నారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం లోగా ఈవీఎం మెషిన్లు పోలింగ్ కేంద్రాలకు చేరుతాయి. ఉదయం 7 లోపు మాక్ పోలింగ్ పూర్తి చేసి పోలింగ్ ప్రారంభించాలని సీఈవో తెలిపారు.

పోలింగ్ స్టేషన్‌లో ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే ఉండాలి. పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం చేయకూడదు. పోలింగ్ కేంద్రాలోకి ఫోన్‌లకు అనుమతి లేదు. ఇప్పటివరకూ 269.28 కోట్లు నగదు,మద్యం,ఇతర అభరణాలు సీజ్ చేశాం. సివిల్ పోలీసులు 58,948 మంది విధుల్లో ఉంటారు.

ఏపీఎస్పీ, కేంద్ర బలగాలు కలిపి మొత్తం 28,588 మంది విధుల్లో ఉన్నారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌స్‌, మాజీ సర్వీస్‌ మెన్‌, రిటైర్డ్‌ పోలీసులు 18,609 మంది ఉన్నారు. మొత్తంగా 1,06,145 మంది పోలీసులు,ఇతరులు ఉన్నారు. మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లలో 12,438 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్ చేయకూడదు. 10,30,000 మంది యువ ఓటర్లు ఉన్నారు’’ అని సీఈవో వెల్లడించారు.

 

 

 

 

 

 

 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)