Breaking News

సీఎం రమేష్‌పై కేసు నమోదు

Published on Fri, 04/05/2024 - 13:46

విశాఖపట్నం, సాక్షి: కూటమి తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై పోలీస్‌ కేసు నమోదు అయ్యింది. ‘‘నా సంగతి మీకు తెలియదంటూ..’’ జీఎస్టీ తనిఖీల కోసం వెళ్లిన డీఆర్‌ఐ(Directorate of Revenue Intelligence) అధికారులపై గుండాయిజం ప్రదర్శించారాయన. ఈ ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ చోడవరం పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. 

డీఆర్‌ఐ అధికారులకు ఆటంకం కలిగించడంతో పాటు వాళ్ల చేతుల్లో ఫైళ్లను లాక్కునే ప్రయత్నం చేశారు సీఎం రమేష్‌. దీంతో.. అధికారుల విధులకు ఆటంకం కలిగించే యత్నం చేశారని.. బెదిరింపులకు పాల్పడ్డారని చోడవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 143, 506, 342, 353, 201, 188 red with 149 కింద కేసు నమోదు చేశారు. సీఎం రమేష్‌తో పాటు చోడవరం టీడీపీ అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, టైల్స్‌ వ్యాపారి బుచ్చిరాజు, రామకృష్ణలతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. 

అసలేం జరిగిందంటే.. గాంధీ గ్రామంలో బుచ్చిరాజు అనే టీడీపీ సానుభూతిపరుడు హోల్‌సేల్‌ టైల్స్, మార్బుల్స్‌ వ్యా­పా­రం నిర్వహిస్తున్నారు. దానిపై డైరెక్టర్‌ ఆఫ్‌ రెవె­న్యూ ఇంటెలిజెన్స్‌ విభాగం(డీఆర్‌ఐ) అధి­కారి శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఆరుగురితో కూడిన ఓ బృందం గురువారం తనిఖీలు నిర్వహిస్తోంది. జీఎస్టీ సక్రమంగా కట్టడం లేదంటూ షాపు రికార్డులన్నీ వారు తనిఖీ చేస్తుండగా టైల్స్‌ వ్యాపారి బుచ్చి­రాజు స్థానిక టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజుకు, అనకాపల్లి టీడీపీ, బీజే­పీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు ఫోన్‌ చేశారు.

వెంటనే వారిద్దరూ తమ అనుచరులతో టైల్స్‌ షాపు దగ్గరకు చేరుకున్నారు. అధికారుల దగ్గర్నుంచి రికార్డులను సీఎం రమేష్‌ లాక్కు­న్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎ­లా తనిఖీలు చేస్తారంటూ వారిపై దౌర్జన్యానికి ది­గా­రు. అంతేనా అధికారులని కూడా చూడకుండా పరుషపదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. ఔ

ఇదీ చదవండి: బ్యాంకుల మోసగాడు ఎంపీ అభ్యర్థా? 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)