Breaking News

తెలంగాణలో కాకరేపుతున్న క్యాంప్‌ పాలిటిక్స్‌

Published on Sat, 02/14/2026 - 19:41

మొయినాబాద్‌: తెలంగాణలో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం క్యాంప్‌ రాజకీయాలు మరింత హీట్‌ పుట్టిస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులు ఎక్కడ జంప్‌ జిలానీ అంటారో అని ఆయా పార్టీలు వారిని డేగ కళ్లతో కనిపెడుతున్నాయి. 

దీనిలో భాగంగా వారిని క్యాంప్‌లకు తరలిస్తూ దాచేయత్నం చేస్తున్నారు.  ప్రస్తుతం రిసార్ట్‌ల్లో దాస్తున్న అభ్యర్థులను డైరెక్ట్‌గా చైర్మన్‌, మేయర్‌ ఎన్నికకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అభ్యర్థులు చేయి జారకుండా పార్టీల జాగ్రత్తలు పడుతున్నాయి. మధ్యలో గ్యాప్‌ ఇస్తే అభ్యర్థులు మాయమైపోతారనే భయంలో పార్టీలు ఉన్నాయి. 

జగిత్యాలలో ఒకే పార్టీలో క్యాంప్‌ రాజకీయాలు..
జగిత్యాలలో ఒకే పార్టీలో ఇద్దరు ప్రత్యర్థి నేతల మధ్య మొదలైన క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. తన అనుచరులు 18 మందితో కలిసి హైదరాబాద్ క్యాంపునకు మాజీమంత్రి జీవన్ రెడ్డి బయల్దేరారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు మేజిక్ ఫిగర్ 26 సీట్లు..ఎమ్మెల్యే సంజయ్ వర్గం వైపు తన వర్గీయులతో పాటు, ఎంఐఎం ఇద్దరు, ఇండిపెండెంట్స్ కలిపి 22కు చేరింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంజయ్, మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇద్దరూ చేతులు కలిపితేనే జగిత్యాల బల్దియా కాంగ్రెస్ వశమవుతుంది. 

సంజయ్ వర్గంతో కలిసేందుకు  జీవన్ రెడ్డి..ససేమిరా అంటున్నారు. ఆదినుండి పార్టీ జెండా మోసిన వారికే చైర్మన్ పీఠం దక్కాలని పట్టుబడుతున్నారు.రసకందాయంగా జగిత్యాల్లో కాంగ్రెస్ అంతర్గత క్యాంప్ రాజకీయాల కొట్లాట మొదలైంది. ఇక పాలమూరు టూ చీరాల క్యాంపుకు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు బయల్దేరారు. రాత్రే ఓ వాహనంలో కొందరు వెళ్లగా నేడు మరో టూరిస్ట్ బస్సులో పయనమయ్యారు. కార్పొరేటర్లతోపాటు ఎమ్మెల్యే, పార్టీ ప్రదాన నేతలు సైతం క్యాంపులకు బయల్దేరారు. ఇలా తెలంగాణలో ప్రతీ చోటా క్యాంపు రాజకీయాలే కనిపిస్తున్నాయి. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)