Breaking News

తెరుచుకున్న ‘పూరీ’ ద్వారాలు.. తొలి హమీ నిలబెట్టుకున్న బీజేపీ

Published on Thu, 06/13/2024 - 08:38

ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయాలనికి గల నాలుగు ద్వారాలు వేదమంత్రోచ్ఛారణల నడుమ నేటి (గురువారం) ఉదయం తెరుచుకున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన దరిమిలా జరిగిన క్యాబినెట్‌ భేటీలో తొలుత పూరి ఆలయ నాలుగు ద్వారాలు తెరవాలని నిర్ణయించారు. దీనిని సర్కారు వెంటనే అమలులోకి తెచ్చింది. 



నూతన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితోపాటు మంత్రులంతా పూరీ దేవాలయ నాలుగు ద్వారాలను తెరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు కూడా ప్రవేశం కల్పించారు. ప్రస్తుతం ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. 12 వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో నేటి వరకూ ఒక్క ద్వారం నుంచే భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కరోనా మహమ్మారి వ్యాప్తి ముందునాటి వరకూ పూరీ ఆలయంలోని నాలుగు ద్వారాల నుంచి కూడా  భక్తుల ప్రవేశానికి అనుమతి ఉండేది. కోవిడ్-19 విజృంభణ సమయంలో కేవలం ఒక్క ద్వారం నుంచే భక్తుల ప్రవేశానికి అనుమతి కల్పించారు. నాటి నుంచి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం  ఆలయానికి గల మూడు ద్వారాలను తెరవలేదు.

ఈ నేపధ్యంలో భక్తులకు ఏర్పడుతున్న ఇబ్బందులకు గమనించిన బీజేపీ.. పూరీ ఆలయంలోని నాలుగు ద్వారాలను తెరిపిస్తామని ఎన్నికలకు ముందు హామీనిచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏ‍ర్పాటు కాగానే బీజేపీ ఈ హామీని నిలబెట్టుకుంది. బుధవారం జరిగిన తొలి క్యాబినెట్‌ భేటీలో పూరీ ఆలయానికి రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సీఎంతో పాటు మంత్రులంతా పూరీకి చేరుకున్నారు.
 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)