Breaking News

ప్రతి గ్రామానికి వెళ్లండి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోండి

Published on Tue, 03/19/2024 - 02:16

సాక్షి, అమరావతి : ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలుతో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని, ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకో­వా­లని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఈ వెసులుబాటును అభ్యర్థులు సద్విని­యోగం చేసుకోవాలని సూచించారు. సోమ­వారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వ­య­కర్తల­తో సీఎం జగన్‌ సమావేశ­మయ్యారు. మే 13న ఎన్ని­కల పోలింగ్‌ జరుగుతున్నందున అభ్యర్థులకు సరి­పడా సమయం ఉందన్నారు.

ఈ సమయాన్ని చక్కగా విని­యోగించుకోవాలన్నారు. తమ నియో­జ­­క­వర్గపరిధిలోని ప్రతి గ్రామ సచివాల­యాన్ని సందర్శించి.. వీలైనంత ఎక్కువ మంది ప్రజలను కలిసేలా అభ్యర్థులు కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. దీనిపై అభ్యర్థులకు మార్గనిర్దేశం చేయాలని ప్రాంతీయ సమన్వ­యకర్త­లను ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 పార్ల­మెంటు నియో­జ­కవర్గాల్లో మార్పులు చేశామన్నారు. అభ్యర్థులకు ఇప్పుడున్న సమయం చాలా చక్కగా ఉపయోగప­డుతుందన్నారు.

ఆయా నియోజక­వర్గా­ల్లోని పార్టీ శ్రేణులు, నాయకత్వాన్ని సంఘటిత పరి­చి, వారిని ఏకతాటి­పైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేశారు. 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు నడవాలని లక్ష్య నిర్దేశం చేశారు. ఈ దిశగా కలిసి వచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకుని, ఘన విజయాలు నమో­దు చేయాలని పిలు­పు­నిచ్చారు. ప్రాంతీయ సమన్వ­యకర్తలు ఎప్పటి­కప్పుడు తమ తమ ప్రాంతాల్లో పరిస్థితులను తెలు­సు­కుంటూ అభ్యర్థులకు చేదోడు, వాదోడుగా నిల­వాలని సూచించారు. బస్సు యాత్ర­ను విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. బస్సు యాత్రలో భాగంగా జరిగే సభలు.. సిద్ధం సభల తరహాలోనే చరిత్రాత్మకం కావాలని దిశా నిర్దేశం చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)