Breaking News

అసెంబ్లీ సాక్షిగా వీడియోలతో వాస్తవాలను బయటపెట్టిన మంత్రి బుగ్గన

Published on Wed, 03/15/2023 - 13:08

సాక్షి, అమరావతి: గవర్నర్‌ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తిప్పికొట్టారు. గవర్నర్‌ ప్రసంగాన్ని కొందరు హేళనగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో ఆయన మాట్లాడుతూ, గవర్నర్‌ ప్రసంగంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. పయ్యావుల బండారాన్ని మంత్రి బుగ్గన బయటపెట్టారు. గవర్నర్‌కు సీఎం స్వాగతం పలకలేదనే టీడీపీ తప్పుడు ప్రచారంపై వీడియోలతో సహా వాస్తవాలను మంత్రి బయటపెట్టారు.

టీడీపీవి అన్నీ తప్పుడు ఆరోపణలు. గవర్నర్‌కు మేము ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదని మంత్రి బుగ్గన వివరించారు. గవర్నర్‌కు స్వాగతం పలికిన వీడియోను ఆయన ప్రదర్శించారు. గవర్నర్‌ పట్ల గౌరవ సభ పట్ల అమర్యాదగా ప్రవరిస్తున్నారని, టీడీపీ తన వక్రబుద్ధిని మార్చుకోవాలని మంత్రి బుగ్గన హితవు పలికారు.

‘‘అవాస్తవ ప్రచారాలపై స్పీకర్‌ కఠిన చర్యలు తీసుకోవాలి. ఎల్లో మీడియా కూడా బాధ్యతరహితంగా వార్తలు రాసింది. టీడీపీ వ్యవహారశైలి సభా హక్కుల ఉల్లంఘనే. తప్పుడు ఆరోపణలు చేసినవారితో పాటు అవాస్తవాలు ప్రచురించిన వారిపైనా తీవ్ర చర్యలు తీసుకోవాలి. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్‌ కమిటీకి రిఫర్‌ చేయాలి’’ అని మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పీకర్‌ను కోరారు.
చదవండి: జెండా పవన్‌ది.. అజెండా టీడీపీది: మంత్రి అమర్‌నాథ్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)