Breaking News

ఇంత దా‘రుణమా’?

Published on Sun, 03/02/2025 - 08:54

సాక్షి, అమరావతి: ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబరులో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌(AP Budget)లో రాష్ట్ర అప్పులను రూ.6.46 లక్షల కోట్లుగా చూపారు. ఇందులో 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం(YSRCP Govt) వచ్చే నాటికి ఉన్న రాష్ట్ర అప్పు రూ.3.10 లక్షల కోట్లు. 2024లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.6.46 లక్షల కోట్లు. అందులో టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయేనాటికి రూ.3.10 లక్షల కోట్ల అప్పులు కూడా ఉన్నాయి.

ఇవన్నీ మీరు మీ తొలి బడ్జెట్‌లో చూపినవే. అయినా సరే రుణాలపై మళ్లీ అసత్య ప్రచారం చేస్తారా..?’’ అంటూ సీఎం చంద్రబాబును ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌(Buggana Rajendranath) నిలదీశారు. ‘‘మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పదేపదే అసత్యాలు వల్లె వేస్తారా? బడ్జెట్‌ వాల్యూమ్‌–6 (బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌)లో రాష్ట్ర అప్పుల వివరాలను ముద్రించడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రస్తుత బడ్జెట్‌లో ఆ వివరాలను ఎందుకు ముద్రించలేదు? అప్పులపై వాస్తవాలు బహిర్గతమవుతాయనే ఆ వివరాలను మీరు ముద్రించలేదన్నది వాస్తవం కాదా?’’ అని బుగ్గన నిలదీశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే తక్షణమే బడ్జెట్‌ వాల్యూమ్‌–6లో రాష్ట్ర అప్పుల వివరాలను ముద్రించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో బుగ్గన ఇంకా ఏమన్నారంటే..

⇒ రాష్ట్ర అప్పులపై టీడీపీ(TDP) కూటమి అదే పనిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోంది. ఇష్టానుసారం మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరాయంటూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. శనివారం కూడా చిత్తూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు గత పాలకులు రాష్ట్రాన్ని అడవి పందుల్లా దోచుకు తిన్నారని, రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారని నిందిస్తూ, వైఎస్సార్‌సీపీ          ప్రభుత్వంపై నిందలేశారు.

⇒ నిజానికి ఏనాడూ రాష్ట్ర అప్పులు ఆ స్థాయిలో లేవు. ఎవరి హయాంలో అప్పులు పెరిగాయి? అనేది ఆధారాలతో సహా మేం చాలాసార్లు మాట్లాడాం. స్పష్టంగా చూపాం. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో అప్పుల పెరుగుదల  కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ (సీఏజీఆర్‌) 19.54 శాతం కాగా, 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పుల పెరుగుదల సీఏజీఆర్‌ 15.61 శాతం మాత్రమే.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్‌ వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయి, ఖర్చులు పెరిగినా కూడా, అప్పుల పెరుగుదల తక్కువే. అవన్నీ గణాంకాలతో సహా చెప్పాం. కానీ, చంద్రబాబు ఏనాడూ దానికి సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే, అవన్నీ వాస్తవాలు కాబట్టి. మరి అలాంటప్పుడు మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని అంత అన్యాయంగా ఎలా మాట్లాడారు చంద్రబాబూ?.

⇒ ఇక ఈ ఏడాది బడ్జెట్‌లో చంద్రబాబు సర్కార్‌ అప్పులు చూపలేదు. బడ్జెట్‌ వాల్యూమ్‌–6లో రాష్ట్ర రుణాలపై అన్ని వివరాలు చూపడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ, సంప్రదాయం. కానీ, సీఎం చంద్రబాబు దాన్ని కాలరాసి, ఈ ఏడాది బడ్జెట్‌లో రాష్ట్ర అప్పులను చూపలేదు. వాటి వివరాలు వెల్లడించలేదు. దీన్నిబట్టి ఆయ­న ఉద్దేశం ఏమిటన్నది ప్రజలు అర్ధం చేసుకోవాలి.

⇒ బడ్జెట్‌ వాల్యూమ్‌–6లో రాష్ట్ర రుణాల వివరాలు ప్రకటిస్తే, వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఎవరి హయాంలో ఎంత అప్పు చేశారన్నది తెలుస్తుంది. చంద్రబాబు అసత్య ప్రచారం బయటపడుతుందని అర్ధమవుతుంది. ఈ ఉద్దేశంతోనే  బడ్జెట్‌లో అప్పుల వివరాలు వెల్లడించకుండా, యథావిథిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ, పచ్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు.కానీ, కాగ్‌ నివేదిక ఆధారంగా ప్రజలకు ఎలాగూ రాబోయే కాలంలో నిజం తెలుస్తుంది.

⇒ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా.. రాష్ట్రాన్ని అడవి పందుల్లా దోచుకుతిన్నారని, రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారని పచ్చి అసత్యాలతో నిందించడం మీ స్థాయికి భావ్యమా చంద్రబాబూ?. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలి.

⇒ మీకు నిజంగా ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఉంటే వాల్యూమ్‌–6లో ఆనవాయితీగా, సంప్రదాయబద్ధంగా దశాబ్దాల నుంచి వచ్చే పద్ధతిలో అన్ని వివరాలతో అప్పుల వివరాలు ప్రింట్‌ చేయండి చంద్రబాబూ? అప్పుడు నిజమేదో బయట పడుతుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)