ఏపీ ఆదాయం.. అసలు వాస్తవం ఇదే: బుగ్గన

Published on Wed, 09/03/2025 - 19:29

సాక్షి, తాడేపల్లి: గత నెలలో రాష్ట్ర ఆదాయాలు పడిపోవటంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బుగ్గన తెలిపిన వివరాలను ఎక్స్‌లో వైఎస్సార్‌సీపీ పోస్టు చేసింది. గత ఆగస్టు నెలలో ఎస్.జీ.ఎస్.టీ. ఆదాయాలు భారీగా తగ్గిపోయాయి.. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దానికీ, వాస్తవ ఆదాయాలకు చాలా తేడా ఉంది. జీఎస్టీ ఆదాయాలు భారీగా తగ్గిపోవటానికి కూటమి ప్రభుత్వ బలహీన ఆర్థిక విధానాలే కారణం’’అని బుగ్గన పేర్కొన్నారు.

‘‘గత ఆగస్టు 23న వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్ర ఆదాయాలు, పెట్టుబడుల్లో క్షీణతపై జగన్ ప్రశ్నిస్తే ప్రభుత్వం మౌనంగా ఉంది. 2023 ఆగస్టు నుండి 2025 ఆగస్టు వరకు CAGR కేవలం 7.0 శాతం మాత్రమే ఉంది. నికర GST ఆదాయాల CAGR 6.94 శాతం మాత్రమే. ఈ ఏడాది కనిపిస్తున్న పెరుగుదల అనేది వాస్తవ వృద్ధి కాదు’’ అని బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు.

‘‘మంత్రి నారా లోకేష్  రాష్ట్ర ఆర్థిక వృద్ధి 15 శాతం CAGRతో ఉందని చెప్తున్నారు. వాస్తవంగా జీఎస్టీ ఆదాయాల వృద్ధి 7 శాతం మాత్రమే. ఇది చాలా నిరాశాజనకమైన ఫలితం. ఇప్పటికైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడటానికి చక్కని విధానాలను రూపొందించాలి. అది వదిలేసి జీఎస్టీ వృద్ధిని విజయంగా చూపించుకోవటానికి తాపత్రయ పడుతోంది’’ అంటూ బుగ్గన రాజేంద్రనాథ్‌ దుయ్యబట్టారు.

Videos

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)