Breaking News

UP: సింగిల్‌గా పోటీ.. ఫస్ట్‌ లిస్ట్‌ ప్రకటించిన మాయావతి

Published on Sun, 03/24/2024 - 16:27

బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు గాను తొలివిడతలో 16 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పొత్తు పుకార్లను కొట్టిపారేస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము స్వతంత్రంగానే పోటీ చేయాలని నిర్ణయించారు.

బీఎస్పీ తొలి విడత జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నౌర్, నగీనా, మురాదాబాద్, రాంపూర్, సంభాల్, అమ్రోహా, మీరట్, బాగ్‌పట్ స్థానాలతో సహా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 80 లోక్‌ సభ నియోజకవర్గాలు ఉన్నాయి.

సహరాన్‌పూర్ నుంచి మాజిద్ అలీ, కైరానా నుంచి శ్రీపాల్ సింగ్, ముజఫర్‌నగర్ నుంచి దారా సింగ్ ప్రజాపతి, బిజ్నోర్ నుంచి విజయేంద్ర సింగ్, నాగినా (ఎస్సీ స్థానం) నుంచి సురేంద్ర పాల్ సింగ్, మొరాదాబాద్ నుంచి మహ్మద్ ఇర్ఫాన్ సైఫీలను బరిలోకి దించింది. ఇక రాంపూర్ నుంచి జిషాన్ ఖాన్, సంభాల్ నుంచి షౌలత్ అలీ, అమ్రోహా నుంచి మొజాహిద్ హుస్సేన్, మీరట్ నుంచి దేవవ్రత్ త్యాగి, బాగ్‌పత్ నుంచి ప్రవీణ్ బన్సాల్‌లకు బీఎస్పీ టికెట్ ఇచ్చింది.

గౌతమ్ బుద్ధ నగర్ నుంచి రాజేంద్ర సింగ్ సోలంకి, బులంద్‌షహర్ (ఎస్సీ స్థానం) నుంచి గిరీష్ చంద్ర జాతవ్, అయోన్లా నుంచి అబిద్ అలీ, పిలిభిత్ నుంచి అనిస్ అహ్మద్ ఖాన్ అలియాస్ ఫూల్ బాబు, షాజహాన్‌పూర్ (ఎస్సీ) నుంచి దోదరం వర్మ బరిలోకి దిగనున్నారు.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)