Breaking News

ఏకపక్ష నిర్ణయాలు ఉండవు: కేటీఆర్‌

Published on Thu, 01/04/2024 - 05:10

సాక్షి, హైదరాబాద్‌: ‘పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం కేవలం బీఆర్‌ఎస్‌ ఎంపీలతోనే సాధ్యమవుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు గులాబీ దళాన్ని గెలిపించి తెలంగాణకు బలం ఇవ్వమని ప్రజలను కోరుతున్నాం. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకపక్ష నిర్ణయాలుండవు. అందరి అభిప్రాయాలూ తీసుకుంటాం..’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు స్పష్టం చేశారు. లోక్‌ సభ సన్నాహక సమావేశాల తొలిరోజు బుధవారం తెలంగాణ భవన్‌లో ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

పేగులు తెగేదాకా పోరాడేది బీఆరెస్సే
‘బీఆర్‌ఎస్‌ దళం, గళం పార్లమెంటులో ఉండాలి. బీఆర్‌ఎస్‌ వల్లే పార్లమెంటులో తెలంగాణ మాట ప్రతిధ్వనిస్తుంది. రాష్ట్ర హక్కుల కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది బీఆర్‌ఎస్‌ మాత్రమే. బెంగాల్‌కు మమతా బెనర్జీ, తమిళనాడుకు డీఎంకే స్టాలిన్, ఏపీకి జగన్, చంద్రబాబు, ఒడిశాకు నవీన్‌ పట్నాయక్, బీహార్‌కు నితీశ్‌కుమార్, మహారాష్ట్రకు శరద్‌ పవార్‌ తరహాలో తెలంగాణ రాజకీయ అస్తిత్వానికి ప్రతీక, పర్యాయపదం కేసీఆర్‌.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఆ తర్వాత విభజన హామీల అమలు, రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై కొట్లాడింది కూడా కేసీఆర్‌ మాత్రమే. మోదీ, రాహుల్‌ ఎన్నడూ తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంటులో మాట్లాడరు. తెలంగాణ గళానికి బలం లేకపోతే పార్లమెంటులో తెలంగాణ పదం వినపడకుండాపోయే చాన్స్‌ ఉంది..’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు కార్యాచరణ
‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాలను సమీక్షించుకుంటున్నాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ, గతంలో జరిగిన పొరపాట్లను సవరించుకుంటాం. చిన్న చిన్న లోటు పాట్లను సరిదిద్దుకునే దిశగా అంతర్గతంగా కార్యాచరణ ప్రారంభించాం. కేసీఆర్‌ కోలుకునేందుకు మరో ఐదారు వారాలు పడుతుంది. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కేసీఆర్‌ కూడా తెలంగాణ భవన్‌కు వచ్చి అందరితోనూ మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు.

ఆదిలాబాద్‌  లోక్‌సభ సమీక్ష సందర్భంగా సుమారు 26 మంది నేతలు మాట్లాడిన అంశాలను క్రోడీకరించి కేసీఆర్‌కు వివరిస్తాం. స్థానిక వ్యతిరేకతతో కొందరు ఎమ్మెల్యేలు ఓడినా సీఎంగా కేసీఆర్‌ ఉంటారని ప్రజలు భావించినట్లు మా నేతలు చెప్తున్నారు. అభివృద్ధి విషయాల్లో ఎక్కడా బీఆర్‌ఎస్‌ పనితీరుపై ఫిర్యాదులు లేవు. కాంగ్రెస్‌ ఫేక్‌ ప్రాపగాండాతో యువత, ఉద్యోగులు కొంత దూరమయ్యారు. పార్టీ, పాలనలో కొన్ని లోటుపాట్లు సవరించక పోవడం వల్ల ఓటమి పాలయ్యామనే ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. దానికనుగుణంగా పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తాం..’ అని చెప్పారు.

కాంగ్రెస్‌ దుర్మార్గాలను ఎండగడతాం
‘రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ వాటిని ఎగవేసేందుకు చేస్తున్న సిల్లీ రాజకీయాలను ప్రజలు గమని స్తున్నారు. తెలంగాణ విజయాలను వైఫల్యా లుగా చూపేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్ని స్తున్నాయి. అబద్ధాలను అస్త్రంగా మార్చుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వంద రోజుల్లో హామీలను నెరవేర్చకుంటే ప్రజలను చైతన్యవంతులను చేసి ఆ ప్రభుత్వాన్ని బొంద పెడతాం.

రాబోయే రోజుల్లో మండల, నియోజకవర్గ స్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని రకాల ఎన్నికలకు కేడర్‌ను సన్నద్ధం చేస్తాం. కేడర్‌కు అండగా ఉంటూ కాంగ్రెస్‌ దుర్మార్గాలను ప్రజాస్వామికంగా ఎండగడతాం..’ అని కేటీఆర్‌ అన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.  

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)