Breaking News

బీఆర్‌ఎస్‌ దేశంలోనే నంబర్‌-1.. సెకండ్‌ ప్లేస్‌లో ఆప్..!

Published on Tue, 04/25/2023 - 15:07

న్యూఢిల్లీ: ప్రాంతీయ పార్టీలకు విరాళాలకు సంబంధించి 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్ దేశంలోనే టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. ఆ పార్టీకి మొత్తం రూ.40.9కోట్లు విరాళాలు అందాయి. ఆ తర్వాత రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉంది. ఆప్‌కు రూ.38.2 కోట్ల విరాళాలు అందాయి.

అసోసియేషన్‌ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్‌(ఏడీఆర్‌) ఈ గణాంకాలను వెల్లడించింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో బీఆర్‌ఎస్, ఆప్‌ తర్వాత జేడీఎస్‌కు అత్యధిక విరాళాలు అందాయి.  ఆ పార్టీకి రూ.33.2 కోట్లు డోనేషన్ల రూపంలో వచ్చాయి.

అలాగే సమాజ్‌వాదీ పార్టీకి రూ.29.7కోట్లు, వైఎస్సార్‌సీపీకి రూ.20 కోట్లు విరాళాలు అందినట్లు ఏడీఆర్ నివేదక తెలిపింది.  ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలు వెల్లడించింది. దేశంలోని మొత్తం 26 ప్రాంతీయ పార్టీలకు రూ.189.8 కోట్లు అందినట్లు నివేదిక పేర్కొంది.  వీటిలో రూ.162.21 కోట్ల విరాళాలు ఐదు పార్టీలే అందుకున్నట్లు తెలిపింది.

అయితే ఏఐఏడీఎంకే, బీజేడీ, ఎన్డీపీపీ, ఎస్‌డీఎఫ్, ఏఐఎఫ్‌బీ, పీఎంకే, జేకేఎన్‌సీ పార్టీలు తమకు అందిన విరాళాల వివరాలను వెల్లడించలేదు. కాగా.. ప్రాంతీయ పార్టీగా ఉన్న ఆప్‌కు ఎన్నికల సంఘం ఈ నెలలోనే జాతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
చదవండి: కర్ణాటక ఎన్నికలు: 517 నామినేషన్ల ఉపసంహరణ.. 209 స్థానాల్లో ఆప్‌ పోటీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)