Breaking News

తెలంగాణకు నంబర్‌ వన్ విలన్‌ కాంగ్రెస్సే: కేసీఆర్‌

Published on Sun, 04/27/2025 - 16:16

కేసీఆర్‌ ప్రసంగం:
👉ఒక్కడిగా బయల్దేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను
👉25 ఏళ్లనాడు గులాబీ జెండా ఎగరేశాం
👉ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం
👉అందరూ అశ్చరపోయేలా పదేళ్లపాటు తెలంగాణను పాలించాం
👉తెలంగాణ ఉద్యమం నుంచి  వెనక్కిపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పా
👉ఆనాడు పదవుల కోసం టీడీపీ, కాంగ్రెస్‌ వాళ్లు.. పెదవులు మూశారు
👉బీఆర్‌ఎస్‌ నేతలు పదవులను త్యాగం చేశారు
👉ఆనాడైనా ఈనాడైనా తెలంగాణకు నెంబర్‌ వన్ విలన్‌ కాంగ్రెస్‌
👉ప్రజలు ప్రాణం  పోసి ఊపిరి ఊదితే అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించాం
👉బలవంతంగా ఆనాడు తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసింది కాంగ్రెస్సే

కాంగ్రెస్‌  మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నాం..
👉నేను ఆమరణ దీక్షకు దిగితే కాంగ్రెస్‌ దిగవచ్చి తెలంగాణపై ప్రకటన చేసింది
👉పదేళ్ల పాలనలో తెలంగాణను అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపాం
👉తెలంగాణ అంటే ఒక్కప్పుడు వెనకబడిన ప్రాంతం
👉మన పాలనలో రూ.90 వేలు ఉన్న తలసరి ఆదాయం మూడున్నర లక్షలకు పెంచుకున్నాం
👉మూడేళ్లలో కాళేశ్వరం కట్టుకున్నాం
👉పడావు భూములను పంటపొలాలుగా మార్చుకున్నాం
👉పంజాబ్‌ను తలదన్నే పంటలను పండించుకున్నాం
👉రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం
👉కాంగ్రెస్‌ ఏడాదిన్నర పాలనలో ఏం చేశారు?
👉గోల్‌మాల్‌ చేయడంలో అబద్ధాలను చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినవారు లేరు
👉మాట్లాడితే కేసీఆర్‌పై నిందులు వేస్తున్నారు
👉ఇక్కడ ఉన్నవాళ్లు చాలరని.. ఢిల్లీ నుంచి గాంధీలు వచ్చి డ్యాన్స్‌లు చేసి హామీలు ఇచ్చారు
👉కల్యాణ లక్ష్మికి కేసీఆర్‌ లక్ష రూపాయలే ఇస్తున్నారు.. మేము వస్తే తులం బంగారం కూడా ఇస్తామన్నారు
👉పెన్షన్లు పెంచుతామన్నారు.. స్కూటీలు కొనిస్తామన్నారు.. జాబ్‌ కార్డులు ఇస్తామన్నారు.. ఇచ్చారా?
👉ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన.. ఎన్ని హామీలైనా అమలు చేసి చూపిస్తామన్నారు
👉లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న దేవుళ్ల అందరిపైనా ఒట్లు వేశారు.
👉మహిళలే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దని అంటున్నారు
👉ఆశపడి.. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు
👉మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు.. అప్పు పుట్టడం లేదని.. ఇప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారు
👉తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు.. పరిపాలన చేయడం రాక రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు
👉తెలంగాణను నంబర్‌వన్‌ స్థానంలో నిలబెడితే.. ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారు
👉హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు

పహల్గామ్‌ మృతులకు నివాళులర్పించిన కేసీఆర్‌
👉ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు హాజరైన కేసీఆర్‌
👉పహల్గాం మృతులకు సంతాపం
👉మౌనం పాటించి సంతాపం తెలిపిన సభ
👉పహల్గామ్‌ మృతులకు నివాళులర్పించిన కేసీఆర్‌

ఎల్కతుర్తికి చేరుకున్న కేసీఆర్‌
👉కాసేపట్లో సభా ప్రాంగణానికి కేసీఆర్‌

సభ ఏర్పాట్లు ఇలా..

👉కేసీఆర్‌ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ
👉బీఆర్‌ఎస్‌ కటౌట్లు,ఫ్లెక్సీలతో వరంగల్‌ ఎల్కతుర్తి గులాబీమయం
👉సభా స్థలి విస్తీర్ణం: 1,213 ఎకరాలు
👉మహాసభ ప్రాంగణం: 154 ఎకరాలు
👉 ప్రధాన వేదికపై సీటింగ్‌: 500 మందికి 
👉వాహనాల పార్కింగ్‌ : 1,059 ఎకరాలు 
👉సభికుల కోసం సిద్ధం చేసిన వాటర్‌ బాటిళ్లు: 10.80 లక్షలు
👉మజ్జిగ ప్యాకెట్లు: 16 లక్షలు 
👉సభావేదిక చుట్టూ అంబులెన్స్‌లు: ఆరు రూట్లు, 20 అంబులెన్స్‌లు
👉మెడికల్‌ క్యాంపు: సభావేదిక చుట్టూ 12 ట్రాఫిక్, పార్కింగ్‌ నిర్వహణ కోసం: 2,500 మంది వలంటీర్లు  

మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం

👉ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్ జాం
👉వరంగల్ ఎల్కతుర్తిలో మాజీ సీఎం కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జాం
👉ఎక్కడ కనిపించని ట్రాఫిక్ పోలీసులు.
👉రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం
👉ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.

👉తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్‌ఎస్‌గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్‌ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్‌ఎస్‌ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో 1,200 ఎకరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు రెండుమూడు రోజుల ముందునుంచే ఎల్కతుర్తికి ప్రయాణం ప్రారంభించాయి.

👉14 ఏండ్లు ఉద్యమ పార్టీగా, తొమ్మిదిన్నరేళ్లు అధికార పారీ్టగా ప్రస్థానం సాగించిన బీఆర్‌ఎస్‌.. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్‌ఎస్‌ తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.

👉సుమారు ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్‌.. ‘రజతోత్సవ సభ’లో చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ చరిత్రలో మొదటి నుంచి కాంగ్రెస్‌ పారీ్టయే విలన్‌గా ఉందని ఈ సభలో కేసీఆర్‌ మరోసారి బలంగా ప్రస్తావించే అవకాశముంది. కేవలం 15 నెలల పాలనలోనే ప్రజల ముందు ఇంతగా పతనమైన ప్రభుత్వాన్ని చూడలేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్‌ చెప్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ మళ్లీ ఛిన్నాభిన్నమైందని ఇటీవల పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. రజతోత్సవ సభలో ఇవే అంశాలను మరింత బలంగా, తనదైన శైలిలో ప్రజలకు వివరించే అవకాశముంది.

👉అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమితో అధికారం కోల్పోయిన కేసీఆర్‌.. కొద్ది రోజుల తర్వాత నివాసంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. సుమారు రెండు నెలల చికిత్స, విరామం తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను ప్రారంభించారు. ఫిబ్రవరి 13న ప్రతిపక్ష నేతగా కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ నల్లగొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మార్చి 12న కరీంనగర్‌లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు.

👉2024 మార్చి 31న తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ఏప్రిల్‌ 5 నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేశారు. ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం నుంచి రెండు రోజుల పాటు నిషేధం కూడా ఎదుర్కొన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటులోనూ విజయం సాధించలేకపోయింది. దీంతో పార్టీ అంతర్గత సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల మొదటి రోజు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. సుమారు ఏడాది కాలంగా బహిరంగ సభలకు, క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న కేసీఆర్‌.. తిరిగి రజతోత్సవ సభ ద్వారా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ప్రకటించే భవిష్యత్‌ కార్యాచరణపై అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.

👉రజతోత్సవ సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్‌పూర్, బావుపేట తదితర గ్రామాల రైతుల నుంచి సేకరించిన 1,213 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. ఇందులో 154 ఎకరాల్లో మహాసభ ఏర్పాట్లు చేయగా, సభకు హాజరయ్యే ప్రజలను తరలించే వాహనాల పార్కింగ్‌ కోసం 1,059 ఎకరాలు కేటాయించారు. వేసవి ప్రతాపం తీవ్రంగా ఉండటంతో సభికుల కోసం 10.80 లక్షల వాటర్‌ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఎండవేడిమికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సేవలందించేందుకు సభావేదిక చుట్టూ 12 వైద్య శిబిరాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

👉సభా వేదికను భారీగా ఏర్పాటు చేశారు. కేసీఆర్‌తోపాటు సుమారు 500 మందివరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్‌ నియంత్రణ కోసం 2,500 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చి నియమించారు. 1,100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఈ సభకు కేసీఆర్‌ హెలికాప్టర్‌లో వస్తారని పారీ్టవర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సభా వేదికకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు కేసీఆర్‌ చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన వేదికపైకి చేరుకుంటారని చెబుతున్నారు. కేసీఆర్‌ సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందన్నారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)