Breaking News

రేవంత్‌, కడియంపై రాజయ్య సంచలన ఆరోపణలు

Published on Sat, 04/12/2025 - 13:35

సాక్షి, జనగామ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లాగా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ముఖ్యమంత్రే భూములు అమ్మడం విడ్డూరం ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఈ నెలలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్‌లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ పాలనలో దోపిడీ పెరిగింది. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ముఖ్యమంత్రే భూములు అమ్మడం విడ్డూరం. ముఖ్యమంత్రికి నేనేమన్నా తక్కువ అన్నట్టుగా ఇనపరాతి గుట్టలపై కడియం శ్రీహరి కన్నేశాడు.

అక్కడ 28 ఎకరాల దేవనూరు భూమి తన బినామీ పేరుపై ఉన్నది వాస్తవం కాదా?. ఆ 28 ఎకరాల వద్ద తన బినామీలతో కడియం దిగిన ఫోటోలు నా వద్ద ఉన్నాయి. దేవనూరులో కడియం శ్రీహరి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఏమీ లేవు. వ్యవసాయం చేసే కుటుంబం అంతకన్నా కాదు. కడియం శ్రీహరి అవినీతి, అక్రమాలకు.. ఆయన ఆస్తులే సజీవ సాక్షాలు. రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్‌ ఘనాపూర్‌ ప్రజలే రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ విమర్శలు చేశారు. 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు