Breaking News

ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాకొద్దు.. సొంత పార్టీ నాయకుల  సంచలన ఆరోపణలు

Published on Sun, 07/09/2023 - 10:58

సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్ బీఆర్ఎఎస్‌లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై సొంతపార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తిరుగుబాటు చేశారు. మూడోసారి ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను మార్చకపోతే, తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

‘ఎమ్మెల్యే శంకర్‌నాయ క్‌ను రెండు సార్లు గెలిపిస్తే కార్యకర్తలను అణ గతొక్కారు.  భూ కబ్జాలు, రక్తపాతాలు సృష్టించారు. ఇటువంటి నేర చరిత్ర ఉన్న శంకర్‌ నాయక్‌కు ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ వద్దు.... కొత్త అభ్యర్థి కి టికెట్‌ ఇవ్వాలి’ అంటూ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు వర్గీయులు, మానుకోట బీఆర్‌ఎస్‌ నాయకులు తీర్మానం చేసి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

శనివారం మహబూబాబాద్‌ జిల్లా ముడుపుగల్లు గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో ముగ్గురు మహబూబాబాద్‌ ము న్సిపల్‌ కౌన్సిలర్లు, ఒక కో–ఆప్షన్‌ సభ్యుడు, కేసముద్రం సర్పంచ్‌తో పాటు మహబూబా బాద్, నెల్లికుదురు, కేసముద్రం, గూడూరు మండలాల మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మా ర్కెట్‌ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.

బినామీలకే పెద్దపీట వేశారు..
మహబూబాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ బానోత్‌ హరిసింగ్‌ మాట్లాడుతూ.. నేర చరిత్ర ఉన్న శంకర్‌నాయక్‌కు కాకుండా కొత్తవారికి టికెట్‌ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. మరోసారి శంకర్‌నాయక్‌ను గెలిపిస్తే బిహార్‌ను తలపించేలా మానుకోటలో అరాచకాలు సృష్టిస్తారని ఎడ్ల రమేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మానుకోటలో అభ్యర్థిని మార్చి కొత్తవారికి టికెట్‌ ఇస్తే కానీ బీఆర్‌ఎస్‌ మళ్లీ గెలవదని నాయకులు రవీంద్రాచారి, ఎడ్లవేణు, కన్నా, జెర్రిపోతులు వెంకన్న, నిమ్మలశ్రీనివాస్‌ పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అనుచరులు జెడ్పీటీసీ రావుల శ్రీనా«థ్‌రెడ్డి, ఎంపీపీలు.. కేసముద్రంలో సమావేశమై ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు సరికావని, ఎమ్మెల్యేను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 
చదవండి: పోరాడండి.. తోడుగా ఉంటాం.. ఈటలకు మోదీ భరోసా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)