Breaking News

మంత్రి కోమటిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

Published on Sun, 03/23/2025 - 05:56

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవాస్తవాలతో సభను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ఈ మేరకు శనివారం స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ను ఆయన చాంబర్‌లో కలసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ నోటీసు అందజేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి కోమటిరెడ్డి సభకు అవాస్తవాలతో కూడిన సమాధానం చెప్పారని నోటీసులో పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సీఆర్‌ఎఫ్‌ నిధులు రాలేదని, ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు ఎస్క్రో ఖాతా తెరవలేదని అబద్ధాలు చెప్పారన్నారు. అలాగే నల్లగొండ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి కూ డా ఖర్చు చేయలేదని అసత్యాలతో సభను తప్పుదోవ పట్టించారన్నారు. ఈ 3 అంశాలకు సంబంధించిన వివరాలను బీఆర్‌ఎస్‌ స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం ఇచ్చి, సభా గౌరవాన్ని తగ్గించారని ఆరోపించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని సభా గౌరవం కాపాడాలని బీఆర్‌ఎస్‌ నేతలు స్పీకర్‌ను కోరారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)