Breaking News

నాడు మీరు పార్టీలో చేర్చుకోలేదా?.. కేటీఆర్‌కు ఎమ్మెల్యే సంజయ్‌ కౌంటర్‌

Published on Tue, 07/02/2024 - 14:02

సాక్షి, జగిత్యాల: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌. అలాగే, తనపై విమర్శలు చేసిన వారే ఏం జరిగిందో ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని కౌంటరిచ్చారు. అలాగే, జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ చేరినట్టు వెల్లడించారు.

కాగా, సంజయ్‌ కుమార్‌ మంగళవారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. నేను బీఆర్‌ఎస్‌లోకి వచ్చినప్పుడు కనీసం ఒక్క కౌన్సిలర్‌గా కూడా  లేని పరిస్థితిలో ఉన్నాను. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టడానికి ఎవరూ ముందుకు రాకపోతే మా బంధువులతో కట్టించాను. నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాను. అందుకే కాంగ్రెస్‌ పార్టీలో చేరాను. 

కేటీఆర్ మాటలు నన్ను బాధించాయి. విమర్శలు చేసిన వారే ఏం జరిగిందో ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి. గతంలో వేరే పార్టీలో  గెలిచినవారిని మీరెలా(బీఆర్‌ఎస్‌) చేర్చుకోన్నారో ముందు సమాధానం చెప్పాలి. జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం. నేను ఒక డాక్టర్‌ను చాలా కుటుంబాలను పోషించేంత ఆర్థికంగా ఉన్నవాడిని. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్‌లో చేరాను. మా కుటుంబం అంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నడిస్తే అభివృద్ధి సాధ్యమని భావించాను. రైతుల కోసం రుణమాఫీ చేయడానికి ప్రక్రియ ప్రారంభించారు సీఎం రేవంత్‌. తెలంగాణాలో ఎక్కడా లేని విధంగా జగిత్యాలలో డబుల్ బెడ్ రూమ్స్ కట్టించాం. దీనికి‌ సంబంధించిన డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. సంజయ్‌ కుమార్‌ ఇటీవలే సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ బీ-ఫామ్‌తో ఎన్నికల్లో గెలిచిన సంజయ్‌.. పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే సంజయ్‌పై కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ఆ‍గ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంలో బీఆర్‌ఎస్‌ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో కూడా పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు సమాచారం.  

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)