Breaking News

రేవంత్‌.. యూఎస్‌ వెళ్లాక సీఎం కుర్చీకి ఎసరే: పాడి కౌశిక్‌రెడ్డి

Published on Fri, 08/02/2024 - 10:24

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి. సీఎం అమెరికా వెళ్లి వచ్చే వరకు ఆయన సభ్యత్వం ఉంటుందో లేదో చూసుకోవాలి. ఖమ్మం, నల్గొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ పాయింట్‌ వద్ద కౌశిక్‌ రెడ్డి మాట్లాడుతూ..‘అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి బెదిరిస్తే బయటపడే వాళ్ళు లేరు. సబితా ఇంద్రారెడ్డిని అవమానించినందుకు చేసిన సీఎం క్షమాపణ చెప్పాలి. అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటాదో లేదో చూసుకో ముఖ్యమంత్రి రేవంత్‌. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందో లేదో కానీ.. మీరు అమెరికా వెళ్లి వచ్చే వరకు సభ్యత్వం రద్దు అయ్యేలా ఉంది. ఖమ్మం, నల్గొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారు.

హుజురాబాద్ ప్రజలకు రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలి. హుజురాబాద్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం స్పందించలేదు. నా జీతం నుంచి నాలుగు లక్షలు వారికి ఇచ్చాను. హుజురాబాద్‌లో పొన్నం ప్రభాకర్ మిత్రుడు మీడియా వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)