Breaking News

వాస్తవాలు నేను నిరూపిస్తా: కౌశిక్‌రెడ్డి

Published on Wed, 11/26/2025 - 20:18

హుజూరాబాద్‌: చెక్‌ డ్యామ్‌లను కాంగ్రెస్‌ ప్రభుత్వం బ్లాస్ట్‌ చేసినట్లు అనుమానాలున్నాయని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. వాస్తవాలను తాను చూపిస్తానంటూ సవాల్‌ చేశారు కౌశిక్‌రెడ్డి. వాస్తవాలు చూపిస్తే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావ రాజకీయాల నుంచి తప్పుకుంటారా?, అని ప్రశ్నించారు. లేకపోతే సీఎం రేవంత్‌రెడ్డిలా మాట తప్పుతారా అంటూ విమర్శించారు కౌశిక్‌రెడ్డి. 

రాష్ట్రంలో మిషన్‌ భగీరథలో భాగంగా తమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 1200 చెక్‌ డ్యామ్‌లు నిర్మిస్తే వాటిని సీఎం రేవంత్‌ సర్కార్‌ కూల్చివేస్తుందంటూ కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.  కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం శంభునిపల్లి-పెద్దపల్లి గుంపుల మధ్య ఉన్న కూలిన చెక్‌ డ్యామ్‌ను కౌశిక్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు సందర్శించారు. 

ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. ఆ చెక్‌డ్యామ్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చివేయడానికి ప్రయత్నించిని పోలీసులు ఇప్పటివరకూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని విమర్శించారు. ఇసుక మాఫియా కోసం రాత్రికి రాత్రే ఆ చెక్‌ డ్యామ్‌ను పేల్చివేశారని రైతులు, మత్స్యకారులు చెబుతున్నారని మండిపడ్డారు. అయితే దీనిపై ఎమ్మెల్యే విజయరామారావు స్పందించగా, దానికి కౌశిక్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. చెక్‌ డ్యామ్‌ను పేల్చేసినట్లు అనుమానాలున్నాయంటూనే వాస్తవాలను చూపిస్తానన్నారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)