Breaking News

పోచారం ఇంటి వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్‌పై చర్యలు?

Published on Fri, 06/21/2024 - 13:03

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇంటి వద్ద బీఆర్‌ఎస్‌ నేతలు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. దీంతో, అక్కడ హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.

వివరాల ప్రకారం.. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌ సమక్షంలోనే వారిద్దరూ హస్తం గూటికి చేరారు. ఇక, పోచారం ఇంట్లోనే సీఎం రేవంత్‌ ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోచారం శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు.

ఈ సమయంలో బీఆర్‌ఎస్‌ ఎ‍మ్మెల్యే బాల్క సుమన్‌ పోలీసుల కళ్లు గప్పి సీక్రెట్‌గా పోచారం ఇంట్లోకి వెళ్లారు. దీంతో, అక్కడ హైటెన్షన్‌ చోటుచేసుకుంది. కాగా, పోచారం ఇంటి వద్ద సెక్యూరిటీ వైఫల్యంపై సీఎంఓ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్‌ ఉండగానే బీఆర్‌ఎస్‌ నేతలు చొచ్చుకురావడంపై సీఎం సెక్యూరిటీ ఆరా తీసింది. భద్రతా లోపంపై నివేదిక ఇవ్వాలని ఏసీపీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వెస్ట్‌ జోన్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌.. పోచారం ఇంటి వద్దకు వెళ్లారు. పోచారం ఇంట్లోకి బాల్క సుమన్‌ చొరబడిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్క సుమన్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నేతలపై చర్యలు ఉంటాయన్నారు.

కాగా, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఎం రేవంత్‌ కాన్వాయ్‌ను బీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో రాజకీయంగా రసవత్తరంగా మారింది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)