Breaking News

‘మేం పార్టీ మారలేదని నోటీసుకు సమాధానం ఇవ్వడమేంటి?’

Published on Fri, 09/12/2025 - 15:48

సూర్యాపేట జిల్లా:  పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి స్పీకర్‌ సరైన నిర్ణయం తీసుకోకపోతే కోర్టుకు పోతామని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్‌ నిర్ణయం అనేది ఎలా ఉంటుందో తమకు తెలుసన్నారు. ఒకవేళ ఆ నిర్ణయం సరిగా లేకపోతే దానికి సంబంధించిన అంశాన్ని కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని, ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు హాస్యాస్పదంగా ఉంది. మేం పార్టీ మారలేదని నోటీసుకు సమాధానం ఇవ్వడమేంటి?, పార్టీ మారకపోతే సీఎం రేవంత్‌ వద్దకు తాజాగా ఎందుకు వెళ్లినట్లు? అని ప్రశ్నించారు. 

కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బీఆర్​ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 

ఇదే అంశంపై తెలంగాణ  స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. స్పీకర్‌ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు.. యూ టర్న్‌ తీసుకున్నారు. తాము కాంగ్రెస్‌లో చేరలేదని బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని స్పష్టం చేశారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)