Breaking News

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: గుత్తా సుఖేందర్‌ రెడ్డి

Published on Fri, 06/23/2023 - 13:52

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తెలిపారు. తన కుమారుడికి పార్టీ అవకాశం ఇస్తే పోటీలో ఉంటారని పేర్కొన్నారు. జిల్లా రాజకీయాల్లో అంతర్గత కలహాలు అనేవి సహజమని చెప్పారు. రేవంత్‌, బండి సంజయ్‌కు రాష్ట్రంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కొంతమంది కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని అన్నారు.

ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు 2018 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లేకుండా కూటమి అని కేసీఆర్ అన్నారని, అందుకే విపక్ష సమావేశాలకు కేసీఆర్ వెళ్లడం లేదని తెలిపారు. వేముల విరేశం కాంగ్రెస్‌లోకి వెళ్తారనేది అవాస్తమని పేర్కొన్నారు. వారసుల కోసం తాము వేరే పార్టీలోకి వెళ్లమని, అవకాశం రాకపోతే పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలు కేవలం గుర్తింపు వరకు మాత్రమే పనిచేస్తాయని.. గెలుపు కోసం పనికిరావని అన్నారు.

‘రేవంత్ రెడ్డి మాటలకు అంతూ పొంతు ఉండదు. రేవంత్ రెడ్డి పార్టీ మారలేదా? రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వకుండా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చాడు. ఫిరాయింపులు ఆపేందుకు చట్టం తేవాల్సింది కేంద్రమే. అలాంటి కేంద్రమే ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందే తప్ప ఒక్క న్యాయం చేయలేదు. రెండు రాష్ట్రాల విభజన హామీలు కేంద్రం పరిష్కరించడంలో విఫలం అయింది’ అని గుత్తా సుఖేందర్‌ రెడ్డి పేర్కొన్నారు.
చదవండి: కేంద్రం నుంచి ఇప్పటి వరకు అందిన సాయం సున్నా: కేటీఆర్‌

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)