Breaking News

కౌశిక్‌రెడ్డిVsసంజయ్‌కుమార్‌: గంగుల కీలక వ్యాఖ్యలు

Published on Mon, 01/13/2025 - 14:47

సాక్షి,కరీంనగర్ జిల్లా: ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి,సంజయ్ కుమార్ వ్యవహారంలో కౌశిక్‌రెడ్డిని పోలీసులు లాక్కెళ్లడం విచారకరమని మాజీ మంత్రి,బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన  ముగ్గురు మంత్రులు వచ్చారని, అక్కడికి మమ్మల్ని ఆహ్వానిస్తేనే వెళ్లామని తెలిపారు. ఎమ్మెల్యేల బాహాబాహీపై గంగుల సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. 

‘సమావేశం ఎజెండా క్లియర్‌గా ఉంది. ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యల్ని తీసుకెళ్లాలనుకున్నాం. మా డిమాండ్స్ సభ ముందు పెట్టాం. ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని వాటి కోసం ఫొటోలు దిగినవారంతా భ్రమలో ఉన్నారు. ఇళ్లపై  క్లారిటీ ఇవ్వాలని కోరాం. దీనిపై సమాధానం రాలేదు.

ఎమ్మెల్యేను లాక్కెల్లడం నేనెప్పుడూ చూడలేదు. ముగ్గురు మంత్రులు అనుమతిస్తేనే లాక్కెళ్లారా..? అనుమతిస్తే మీరు సభ నడపడంలో విఫలమైనట్టే. మీ ఆదేశాలు లేకుండా పోలీసులు స్టేజ్ ఎక్కారంటే మీరు క్షమాపణ చెప్పాలి. సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ ఇరిటేట్ అయ్యాడు. కోపతాపాలు సర్వసాధారణమే అయితే వాటిని కంట్రోల్ చేయాలి.

ఒక ఎమ్మెల్యేను గుంజుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతమందిపై మీరు కేసులు పెడతారు?అదేమైనా బలప్రదర్శన వేదికనా..? పోలీసు కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. కౌశిక్,సంజయ్ మధ్య ఏం జరిగిందనేది డిఫరెంట్, అది వ్యక్తిగతం. కానీ, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారనేది మా ప్రశ్న’అని గంగుల అన్నారు. 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు