Breaking News

తెలంగాణ పోలీసులకు కేటీఆర్‌ వార్నింగ్‌

Published on Wed, 06/18/2025 - 13:47

సాక్షి, సిరిసిల్ల: తెలంగాణలో పోలీసులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తెలంగాణలో పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయని కేటీఆర్‌ ఆరోపించారు. అన్యాయం జరిగిందని.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపైనే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌..‘ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ ఎంపీటీసీ కుంటయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల అంకుశాపూర్ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్య చేసుకోగా, వారి కుటుంబాన్ని పరామర్శించి అన్ని రకాలుగా ఆదుకుంటామని కేటీఆర్‌ ధైర్యం చెప్పారు. అనంతరం, కేటీఆర్‌ మాట్లాడుతూ..‘నేను ఏసీబీ విచారణలో ఉంటే నాకు ధైర్యం చెప్పాడు.. కానీ ఏమైందో తెలియదు రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నారు.  ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. వారి ఇద్దరు పిల్లల చదువులు, పెళ్లిలు, వారికి ఉన్న అన్ని సమస్యలు నేను చూసుకుంటాను. వారికి మాట ఇస్తున్నా.

ఇదే సమయంలో పోలీసు అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయి. అన్యాయం జరిగిందని మా ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే తిరిగి అతనిపైనే కంప్లైంట్ నమోదు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకుల లాగా మేము దిగజారి ప్రవర్తించలేదు’ అని చెప్పుకొచ్చారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)