Breaking News

నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్‌ వాళ్లు ఫీలవుతున్నారు: కేటీఆర్‌

Published on Tue, 01/07/2025 - 20:17

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా ఈ-కారు రేసు(Formula E-car Race)లో తన క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేసినందుకే ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్‌ వాళ్లు ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR). ఇదే సమయంలో తనపై ఏసీబీ పెట్టింది అక్రమ కేసు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే, హైకోర్టు విచారణ చేసుకోండని చెప్పింది కానీ.. నేను నేరం చేశానని చెప్పలేదని అన్నారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నాపై కక్ష సాధించాలనే లొట్టపీసు కేసు పెట్టారు. నాపై పెట్టింది అక్రమ కేసు. ఏసీబీ(Telangana ACB)ది తప్పుడు ఎఫ్‌ఐఆర్‌. అవినీతి లేదని తెలిసి కూడా నామీద కేసు పెట్టి శునకానందం పొందుతున్నారు. న్యాయ వ్యవస్థపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కొంత మంది మంత్రులైతే వాళ్లే న్యాయమూర్తులుగా మారిపోతున్నారు. వారే తీర్పులు చెబుతున్నారు. మంత్రులకు అంత ఉలికపాటు ఎందుకు?. క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేసినందుకే నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్‌ వాళ్లు ఫీలవుతున్నారు. 

మీలాగా దివాళాకోరు పనిచేసే ఖర్మ నాకు పట్టలేదు. హైకోర్టు(telangana High Court) విచారణ చేసుకోండని చెప్పింది కానీ.. నేను నేరం చేశానని చెప్పలేదు. తెలంగాణ ఇమేజ్‌ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఫార్ములా రేస్‌ నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీలో చర్చ పెట్టమంటే రేవంత్‌ పారిపోయారు. రేవంత్‌ ఇంట్రెస్ట్‌ ఫార్ములా.. మా ఇంట్రెస్ట్‌ ఫార్మర్‌. ఇచ్చిన హామీలపై చిట్టి నాయుడు దృష్టి పెట్టాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిలదీస్తాం. అన్ని పార్టీలకు గ్రీన్‌కో ఎ‍న్నికల బాండ్లు ఇచ్చింది. 

చట్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో లాయర్లతో విచారణకు వెళ్లాను. రాజ్యాంగపరంగా ప్రతీ హక్కును వినియోగించుకుంటాను. హైకోర్టు అనుమతి ఇస్తే లాయర్ల కలిసి విచారణకు తప్పకుండా వెళ్తాను. సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాడుతాను. నేను ఏ తప్పూ చేయలేదు.. ఏ విచారణకైనా సిద్ధం. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. ఈనెల 16న ఈడీ విచారణకు కూడా హాజరు అవుతాను. అవినీతిలో పట్టుబడిన వారికి ప్రతీ విషయం అవినీతిలాగానే కనబడుతుంది. ఇది.. ఆరంభం మాత్రమే. చివరికి న్యాయమే గెలుస్తుంది’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)