Breaking News

పులివెందుల పర్యటనలో వైఎస్‌ జ‌గ‌న్.. అభిమానం అంటే ఇదే కదా..

Published on Tue, 02/25/2025 - 20:58

సాక్షి,వైఎస్సార్‌జిల్లా : అభిమానానికి హద్దుండదు. ఆత్మీయతకు వయస్సుతో పనిలేదు. ఈ రెండింటికి సరైన చిరునామా వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. చిన్నారుల్లో జననేతకు ఉన్న క్రేజ్‌ చూస్తూనే ఉన్నాం. అది కుప్పం అయినా, విజయవాడ,గుంటూరు,పులివెందుల అయినా సరే. వైఎస్‌ జగన్‌పై ఉన్న అభిమానం, ఆప్యాయత మరోమారు నిరూపిమతమైంది.

 బాలుడి పేరు మెహబూబ్‌ షరీష్‌. పులివెందులకు ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న కొండారెడ్డి కాలనీలో నివాసం ఉంటాడు. అతనికి వైఎస్‌ జగన్‌ అంటే పిచ్చి. ఎలాగైనా ఈ రోజు తమ అభిమాన నేత వైఎస్‌ జగన్‌ను కలవాలని తెల్లవారు జామున ఐదుగంటలకు చెప్పుల్లేకుండా కాలి నడకన బయలుదేరాడు. వైఎస్‌ జగన్‌ హెలిఫ్యాడ్‌ వద్ద దిగుతారని తెలుసుకొని అక్కడే ఎదురు చూశాడు ఈ బాలుడు.

మధ్యాహ్నం 12గంటల సమయంలో వైఎస్‌ జగన్‌ పులివెందులకు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన వైఎస్‌ జగన్‌ను ఎలాగైనా కలవాల్సిందేనని ప్రయత్నించాడు ఈ బాలుడు. ఎట్టకేలకు వైఎస్‌ జగన్‌ను చూడగానే బాలుడు ఆనంద భాష్పాలు రాల్చాడు. ఆ పిల్లాడిని గమనించిన వైఎస్‌ జగన్‌ దగ్గరకు తీసుకున్నారు. వైఎస్‌ జగన్‌ బాలుడి కళ్ల నీళ్లు తుడిచి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడి అభిమానానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. మొత్తానికి వైఎస్‌ జగన్‌తో బాలుడు ఫొటో దిగాడు. జాగ్రత్తగా ఆ బాలుడిని ఇంటి వద్ద దిగబెట్టాలని పార్టీ నేతలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు.

అభిమానం అంటే ఇదే కదా..

అభంశుభం తెలియని బాలుడే వైఎస్‌ జగన్‌పై చూపిన ప్రేమను నాటి వైఎస్సార్‌సీపీ పాలనకు సాక్షమని పరిశీలకులు అంటున్నారు. బాలుడికి కోరిక తీర్చి వైఎస్‌ జగన్‌ పెద్దమనసు చాటుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే, వైఎస్‌ జగన్‌ తన పాలనలో అమ్మఒడిని అమలు చేశారని, నాడు,నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చారని, అందుకే చిన్నారుల గుండెల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెరగని ముద్రవేసుకున్నారని వైఎస్సార్‌సీపీ అంటోంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)