Breaking News

పెరిగిన బలం.. బీజేపీలో చేరిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు

Published on Wed, 10/09/2024 - 15:33

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను పటాపంచలు చేస్తూ.. తిరుగులేని పార్టీగా అవతరించింది. 90 స్థానాల్లో 48 చోట్ల గెలుపొంది ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

తాజాగా అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఇద్దరు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేలు దేవేందర్‌ కద్యన్‌, రాజేష్‌ జూన్‌.. కేంద్రమంత్రి, హర్యానా ఇంచార్జి ధర్మేంద్ర ప్రధాన్‌ నివాసంలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ మోహన్‌లాల్‌ బడోలీ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రెబల్‌గా బరిలోకి దిగిన కద్యన్‌ గనౌర్‌ నుంచి గెలుపొందగా.. రాజేష్‌ జూన్‌ బహదూర్‌ఘర్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడించి విజయం సాధించారు. 

అయితే మరో ఎమ్మెల్యే సావిత్రి జిందాల్‌ గత మార్చిలో లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. అయితే టికెట్‌ రాకపోవడంతో హిసార్‌ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆమె కూడా బీజేపీకి తన మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.  వీరి చేరికతో  పదేళ్ల పాలన తర్వాత  గెలుపు అసాధ్యమనుకున్న చోట ఘన విజయం సాధించిన బీజేపీకి మరింత బలం చేకూరింది. దీంతో అసెంబ్లీలో బీజేపీ బలం 52కి చేరనుంది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు