బొండా జంప్‌! 

Published on Sat, 04/20/2024 - 04:39

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌):  సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటన అనంతరం చీమ చిటుక్కుమన్నా టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు హడలిపోతున్నారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని సెంట్రల్‌ టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది.

బందోబస్తు విధుల కోసం వచ్చిన పోలీసులను చూసిన బొండా ఉమా ఒక్కసారిగా హడలిపోయి పార్టీ నేతలకు ఫోన్లు చేసి చొక్కా మార్చుకుని అక్కడి నుంచి జారుకున్నారు. తొలుత బొండా ఉమా ఇంటి వద్దకు ఇద్దరు కానిస్టేబుళ్లు బందోబస్తుకు వెళ్లారు. వారిని ఎందుకు వచ్చారంటూ బొండా ప్రశ్నించగా మీకు సెక్యూరిటీగా వెళ్లమన్నారంటూ బదులివ్వడంతో కంగారుపడ్డ ఆయన అక్కడి నుంచి తన కార్యాలయానికి వడివడిగా వెళ్లిపోయారు. 

వంగవీటి రాధాకు ఫోన్‌...! 
టాస్‌్కఫోర్స్, షాడో టీమ్‌లు తనని అరెస్ట్‌ చేసేందుకు వచ్చాయంటూ బొండా ఉమా ఫోన్లు చేయగా టీడీపీ శ్రేణులు స్పందించకపోవడంతో వంగవీటి రాధా, ఆయన మామ చెన్నుపాటి శ్రీనుకు ఫోన్లు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రాధా తన అనుచరులకు ఫోన్లు చేసి అందుబాటులో ఉన్నవారంతా టీడీపీ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. వారంతా అక్కడకు చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. 

షర్టు మార్చి... గోడ దూకి..  
పోలీసులు తనను అరెస్ట్‌ చేస్తారని ఆందోళన చెందిన బొండా ఉమా సెంట్రల్‌ టీడీపీ కార్యాలయం మొదటి అంతస్తులోకి వెళ్లి చొక్కా మార్చుకున్నారు. అనంతరం దాని వెనుకే ఉన్న మరో భవనంలోకి దూకి పరారైనట్లు తెలుస్తోంది. తనకు అత్యంత సన్నిహితుడు, ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న సీనియర్‌ ‘మామ’ బొండా ఉమాను తన కారులో ఎక్కించుకొని మొగల్రాజపురంలోని రాధా ఇంటికి చేరుకున్నట్లు సమాచారం.

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని ముఖ్య ప్రదేశాలు, పార్టీ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే బొండా ఉమా వద్దకు వెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)