Breaking News

అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!

Published on Sat, 05/04/2024 - 13:33

సాక్షి, అనకాపల్లి: ఏపీలో ఓటమి తప్పదని భావించిన కూటమి నేతలు హత్యా రాజకీయాలకు తెరలేపారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి జరిగిన ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అనకాపల్లిలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడి హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం అనకాపల్లిలోని ఆయన స్వగ్రామం తారువలో ఉన్నారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు ఇంటి వద్ద  కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. డ్రోన్‌ సాయంతో విజువల్స్‌ తీశారు. దీంతో, అనుమానం వచ్చి స్థానికులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆరా తీశారు. విజువల్స్‌ తీస్తున్న వారిని పట్టుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారు పొంతనలేని సమాధానం ఇచ్చారు.

అనంతరం దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు స్థానికులు కాదని పోలీసులకు తెలిపారు. దీంతో, ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న బీజేపీ కండువాలను, జెండాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అక్కడ డ్రోన్‌ను ఎందుకు ఎగురవేశారని ప్రశ్నించగా వారు సమాధానం చెప్పకోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు మాట్లాడుతూ.. అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలో ముత్యాల నాయుడికి లభిస్తున్న ఆదరణను ఓర్వలేకనే బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు