Breaking News

వీల్ ఛైర్‌లో మన్మోహన్‌సింగ్‌.. బీజేపీ ఫైర్‌

Published on Tue, 08/08/2023 - 16:11

ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులు మన్మోహన్‌ సింగ్ వీల్ ఛైర్‌లో పార్లమెంట్‌కి తీసుకువచ్చారు. ఈ అంశం అధికార విపక్షాల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. మన్మోహన్‌కు రాజ్యంగం పట్ల ఉన్న విధేయతపై ప్రతిపక్షాలు కొనియాడాయి. అదే తరుణంలో ఆరోగ్యం బాగులేకున్నా.. కేవలం ఢిల్లీ బిల్లును వ్యతిరేకించాలనే చెడు సంకల్పంతో ఆయన్ను సభలోకి తీసుకురావడంపై బీజేపీ మండిపడింది. ఈ చర్యను సిగ్గు చేటుగా అభివర్ణించింది. 

ఢిల్లీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి వచ్చిన మన్‌మోహన్‌ సింగ్‌కు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ విలువల పట్ల ఆయనకు ఉన్న విదేయత ఎంతో గొప్పది అంటూ కొనియాడారు. బ్లాక్ ఆర్డినెన్స్‌పై స్పందించడానికి వచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు. 

మన్మోహన్‌ను రాజ్యసభలోకి తీసుకువచ్చిన తీరు దేశం గుర్తుంచుకుంటుందని బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పిచ్చి ఎంతటిదో అర్థమవుతుందని ఆరోపణలు చేశారు. రాత్రిపూట ఆరోగ్యం బాగులేని మన్‌మోహన్‌ను వీల్‌ ఛైర్‌లో తీసుకురావాల్సినంత అవసమేంటని కాంగ్రెస్‌ను నిందించింది. నిజాయితీ లేని తమ కూటమిని నిలుపుకోవాలనే కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టింది. 

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు మొత్తానికి పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. 131 సీట్లు బిల్లుకు ఆమోదం తెలుపగా.. 101 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ బిల్లు ఢిల్లీలో ఆప్‌, కేంద్రానికి మధ్య విమర్శలకు దారితీసింది. 

ఇదీ చదవండి: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం..

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)