Breaking News

ఏపీ బీజేపీలో నాయకత్వ మార్పు!?

Published on Sun, 01/12/2025 - 03:21

సాక్షి, అమరావతి: బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఈ నెలాఖరులోగా ఎన్నిక జరగనుంది. అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి స్థానంలో కొత్త వారు నియమితులవుతారని పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం సాగుతోంది. 2023 జూలైలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆమెను కొనసాగించే అవకాశం లేకపోలేదని కూడా కొందరు నేతలు అంటున్నారు. అయితే, పురందేశ్వరి పార్టీ అధ్యక్ష బాధ్యతల కంటే.. కేంద్ర మంత్రివర్గంలో చోటుకోసమే ఎక్కువ ఆసక్తితో ఉన్నారని చెబుతున్నారు. 

కాగా.. పార్టీ అధ్యక్ష పదవి కోసం దాదాపు 10 మంది వరకు పోటీ పడుతున్నట్టు పేర్కొంటున్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్, ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్న విష్ణువర్థన్‌రెడ్డితో పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మండల కమిటీల ఎన్నిక పూర్తవగా, వచ్చే వారంలో జిల్లా అధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. 

సంస్థాగత ఎన్నికల ప్రక్రియలోనే  ఏకాభిప్రాయం ప్రకారమే బీజేపీ జిల్లా అధ్యక్ష పదవులకు ఎన్నిక పూర్తి చేసేందుకు పార్టీ నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఇప్పటికీ రాష్ట్ర పార్టీలో పలువురు సీనియర్‌ నాయకులు ఈ నెల 3, 4 తేదీల్లో వివిధ జిల్లాల్లో పర్యటించి నేతల అభిప్రాయాల మేరకు ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్ష పదవులకు పేర్లను రాష్ట్ర పార్టీకి నివేదిక రూపంలో అందజేశారని సమాచారం. 

నివేదికలో సూచించిన పేర్లపై కొద్ది రోజుల క్రితం పార్టీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాశ్‌ నేతృత్వంలో కోర్‌కమిటీ సమావేశమై చర్చించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే వారం, పది రోజుల్లోనే జిల్లాల అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)