Breaking News

ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలి

Published on Tue, 09/05/2023 - 19:23

జైపూర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు జనాభాగణన పూర్తిచేయకుండా 'ఒకే దేశం ఒకే ఎన్నికలకు పిలుపునివ్వడమంటే ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమే అన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఇక రాజస్థాన్‌లో అయితే ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారని బీజేపీ ఎవరితో పెట్టుకుంటున్నారన్న విషయం వారికి తెలియాలని అన్నారు. 

అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగం చిన్నాభిన్నమైందని నేను ఎప్పటి నుంచో చెబుతునే ఉన్నాను. ఈరోజు దేశంలో జరిగేవన్నీ చూస్తుంటే దేశం ఎటువైపు వెళ్తుందో కూడా చెప్పడం కష్టమేనని.. ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్రం ప్రతిపక్షాల అభిప్రాయం కూడా అడిగి ఉంటే బాగుండేదని కానీ వారు ఎవరి అభిప్రాయాన్ని అడగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు.     

ఇక మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తావన తీసుకొస్తూ అసలు ఇలాంటి కమిటీలో మాజీ రాష్ట్రపతి భాగస్వామి కావడం నేనింత వరకు ఎప్పుడు వినలేదు, చూడలేదని అన్నారు. ఇందులోకి అనవసరంగా ఆయనను లాగుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చే హక్కు ఉంది కానీ ప్రజలకు కారణం చెప్పాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఇక రాజస్థాన్ ప్రజలైతే మళ్లీ కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చేశారని అసలు వారు ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియాలని ఘాటుగా స్పందించారు.

ఇది కూడా చదవండి: ఆర్టికల్ 370 రద్దుపై విచారణ.. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీం

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)