Breaking News

బీజేపీ 8వ జాబితా రిలీజ్‌.. ప్రముఖ బాలీవుడ్‌ హీరోకు నో టికెట్‌

Published on Sat, 03/30/2024 - 21:55

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల 8వ జాబితాను బీజేపీ శనివారం(మార్చ్‌ 30) సాయంత్రం విడుదల చేసింది. ఒడిషా, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో 11 సీట్లకు ఈ జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, బ్లాక్‌ బస్టర్‌ గదర్‌ హీరో సన్నీ డియోల్‌కు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నుంచి ఈసారి బీజేపీ టికెట్‌ నిరాకరించింది.

సన్నీ డియోల్‌ స్థానంలో గురుదాస్‌పూర్‌ నుంచి దినేష్‌సింగ్‌ బాబును బరిలోకి దింపింది. పార్లమెంటుకు సరిగా హాజరు కాకపోవడం వల్లే సన్నీ డియోల్‌కు టికెట్‌ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపలేదని సమాచారం. మాజీ సీఎం అమరేందర్‌సింగ్‌ భార్య ప్రణీత్‌ కౌర్‌కు పార్టీలో చేరిన కొద్ది రోజులకే పటియాల నుంచి టికెట్‌ ఇచ్చారు.

అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్‌జిత్‌సింగ్‌ సంధుకు అమృత్‌సర్‌ నుంచి అవకాశం కల్పించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన సుశీల్‌కుమార్‌ రింకూను జలంధర్‌ నుంచి బరిలోకి దింపారు. ఒడిషాలో ఇటీవలే రాష్ట్రంలో అధికార బీజేడీ నుంచి బీజేపీలో చేరిన మోస్ట్‌ సీనియర్‌ ఎంపీ భర్తృహరి మెహతాబ్‌కు కటక్‌ నుంచి టికెట్‌ ఇచ్చారు. 

ఇదీ చదవండి.. బీజేపీ వాషింగ్‌మెషిన్‌ను ప్రదర్శించిన తృణమూల్‌ నేతలు 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)