Breaking News

ఇండియా కూటమి హిందూ వ్యతిరేకి

Published on Tue, 09/05/2023 - 06:15

న్యూఢిల్లీ: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ప్రతిపక్ష ఇండియా కూటమిపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశం హిందూమతమే లక్ష్యంగా జరిగిందని ఆరోపించారు. అయితే, తాము అన్ని మతాలను, ప్రతి ఒక్కరి విశ్వాసాలను గౌరవిస్తామని, అదేసమయంలో ఇతరులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని కాంగ్రెస్‌ పేర్కొంది.

మనుషుల్ని సమానంగా చూడలేని మతం మతమే కాదని కర్ణాటక మంత్రి, కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్‌ ఖర్గే పేర్కొన్నారు. అటువంటి మతం రోగంతో సమానమన్నారు. అయితే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కరణ్‌ సింగ్‌ మాత్రం ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు. దేశంలోని కోట్లాదిమంది ఆచరించే సనాతనధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం, అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.  బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాజకీయ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని కరణ్‌ సింగ్‌ అన్నారు.

క్షమాపణ చెప్పాలి
ఉదయనిధి వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు సోనియాగాంధీ, రాహుల్, అశోక్‌ గెహ్లాట్‌ తదితరులు మౌనంగా ఎందుకున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఆ కూటమి హిందూ మతానికి వ్యతిరేకమని ఆరోపించింది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, ప్రహ్లాద్‌ జోషి,అనురాగ్‌ ఠాకూర్‌ ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు. ఇండియా కూటమి నేతలు క్షమాపణ చెప్పకుంటే దేశం వారిని క్షమించబోదన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఉదయనిధిపై ముజఫర్‌పూర్‌కు చెందిన లాయర్‌ సుధీర్‌ కుమార్‌ ఓఝా కోర్టులో పిటిషన్‌ వేశారు.

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)