బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

Published on Thu, 05/02/2024 - 16:34

రాయ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతూనే ఉంది. ఈ తరుణంలో ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్ జిల్లాలోని చిర్మిరి పట్టణంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పర్యటించారు. కోర్బా లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జ్యోత్సానా మహంత్ మద్దతు కోసం జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని ఆస్తులను బడా బిలియనీర్లకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు.

బీజేపీ దేశంలో రెండు రకాల నాయకులను ప్రోత్సహిస్తోంది. ఇందులో ఒకరు అవినీతిపరులు, మరొకరు ప్రజల సంక్షేమం, సమస్యల గురించి ఏమీ మాట్లాడకుండా ఉండే వారు. ఐదు కేజీల రేషన్ అందించడం ద్వారా ప్రజలను డిపెండెంట్‌గా మార్చాలని బీజేపీ యోచిస్తోంది. దానికి బదులుగా ఉద్యోగాలు పొందటానికి అవకాశాలు సృష్టించాలని ప్రియాంక గాంధీ కోరారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని ఆస్తులను బడా బిలియనీర్లకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. దేశంలో ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయో, దేశంపై ఎలా దాడులు జరుగుతున్నాయో, ఎలాంటి నాయకులను ప్రోత్సహిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రియాంక గాంధీ కోరారు.

ధరల పెరుగుదల గురించి బీజేపీ పార్టీ కానీ, ఆ పార్టీ నేతలు కానీ ఏమీ మాట్లాడారు. గత పదేళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ తన మేనిఫెస్టోకు ‘న్యాయ్ పాత్ర’ అని పేరు పెట్టిందని ప్రియాంక గాంధీ అన్నారు. బీజేపీ పాలనలో పేద ప్రజలకు తప్పా.. పారిశ్రామికవేత్తలకు, బడా నేతలకు అన్యాయం జరగలేదని ఆమె స్పష్టం చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ స్థానాల్లో మొదటి రెండు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నాలుగింటిలో పోలింగ్ జరిగింది. కోర్బాతో సహా మిగిలిన ఏడు స్థానాలకు మే 7న మూడో దశలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)