Breaking News

కర్నాటక ఎన్నికలు: బీజేపీ బిగ్‌ ప్లాన్‌

Published on Thu, 04/20/2023 - 16:08

బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, పార్టీలు తమకు సీటు ఇవ్వకపోవడంతో పలువురు సీనియర్లు, నేతలు ఇతర పార్టీల్లోకి జంప్‌ అయ్యారు. ఇక, నేటితో(ఏప్రిల్‌ 20)తో కర్నాటకలో నామినేషన్ల పర్వం ముగిసింది. కాగా, ఎన్నికల ప్రచారంలో ఓటర్లును ఎలా ప్రసన్నం చేసుకోవాలనే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో స్టార్‌ క్యాంపెయినర్లు రంగంలోకి దిగుతున్నారు. 

ఇదిలా ఉండగా.. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార బీజేపీ పార్టీ బిగ్‌ ప్లాన్స్‌ చేస్తో​ంది. మళ్లీ అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగింది. అందుకు తగిన ప్రణాళిక అమలు చేస్తుంది. ఇక, బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటకకు రానున్నారు. ఏకంగా 10 రోజుల పాటు మోదీ కర్నాటకలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ సమయంలో దాదాపు 20 ర్యాలీల్లో, భారీ బహిరంగ సభల్లో మోదీ పాల్గొనేలా బీజేపీ ప్లాన్‌ చేసింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెనర్ల జాబితాను సైతం విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా వివధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, సెలబ్రెటీల పేర్లు ఉన్నాయి. 

ఇక, కర్నాటక బీజేపీ.. ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రాన్ని ఆరు రిజియన్లుగా విభజించింది. కాగా, బెలగావి, హుబ్బల్లి నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక, జేపీ నడ్డా దాదాపు 25 ర్యాల్లీలో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా, కర్నాటకలో మే 10వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)