Breaking News

‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’

Published on Wed, 05/15/2024 - 13:05

న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మధురలోని కృష్ణ జన్మభూమి స్థలంలో, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో దేవాలయాలు నిర్మిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.

“డబుల్, ట్రిపుల్ సెంచరీలు ఎందుకు సాధించావని సచిన్ టెండూల్కర్‌ని ఎవరైనా అడుగుతారా? మనకు 300 సీట్లు ఉన్నప్పుడు రామమందిరాన్ని నిర్మించాం. ఇప్పుడు మనకు 400 సీట్లు వస్తే మధురలో కృష్ణ జన్మభూమి సాక్షాత్కరిస్తుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు స్థానంలో విశ్వనాథుని ఆలయాన్ని కూడా నిర్మిస్తాం” అని మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో అసోం సీఎం పేర్కొన్నారు.

బీజేపీ తూర్పు ఢిల్లీ అభ్యర్థి హర్ష్ మల్హోత్రా తరపున ప్రచారం చేసేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దేశ రాజధానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన  నాయకత్వంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అవుతుందన్నారు. ‘కశ్మీర్‌ భారత్‌, పాకిస్థాన్‌ రెండింటిలోనూ భాగమని కాంగ్రెస్‌ హయాంలో చెప్పాం. మోదీకి 400 సీట్లు వస్తే పీఓకేని భారత్‌కు తీసుకువస్తాం. 400 సీట్లతో మా ప్రణాళికలను కొనసాగిస్తూ పోతాం.. కాంగ్రెస్‌ ఐసీయూకి చేరుతుంది" అని హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)